ఆయన మామూలు వ్యక్తి కాదు, ఓ రాజకీయ నాయకుడు, అందులోనూ మంత్రి.. అంతే కాదు తన సన్నిహితురాలికి ఖరీదైన బంగ్లాలు గిఫ్ట్ ఇచ్చేంత సహృదయుడు. ఆయన సన్నిహితురాలి ఇంట్లో 21కోట్ల రూపాయల నగదు, కోటి రూపాయల విలువైన బంగారం దొరికిందంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అలాంటి మంత్రి పెంపుడు కుక్కలకోసం ఓ ఫ్లాట్ కొనలేడా..? కొనగలడు, కానీ అందరూ అలా చేస్తారనుకోలేం. అలా చేశారు కాబట్టే ఇప్పుడు పశ్చిమబెంగాల్ మంత్రి పార్థా చటర్జీ వార్తల్లో వ్యక్తి అయ్యారు.

పశ్చిమబెంగాల్ మంత్రి, టీఎంసీ నేత పార్థా చటర్జీ అరెస్ట్ తర్వాత ఈడీ మరింత లోతుగా ఈ కేసు విచారణ చేపట్టింది. దీంతో కీలక విషయాలు, సంచలన విషయాలు వెల్లడవుతున్నాయి. పార్థా చటర్జీ కేవలం తన పెంపుడు కుక్కల కోసమే ఓ లగ్జరీ ఫ్లాట్‌ ను కొన్నట్లు ఈడీ విచారణలో తేలింది. వెస్ట్ బెంగాల్ టీచర్ రిక్రూట్‌ మెంట్ స్కామ్ కేసులో ఆయన్ను ఈడీ అరెస్ట్ చేసిన తర్వాత, ఆస్తులు ఎక్కడెక్కడున్నాయి, ఎవరెవరికి ఈ వ్యవహారంలో భాగముంది అనే విషయాలపై ఆరా తీస్తున్నారు. కోల్‌ కతా సిటీలో పార్థా చటర్జీకి మూడు ఖరీదైన ఫ్లాట్‌ లు ఉన్నట్లు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ అధికారులు గుర్తించారు. అందులో ఒక ఫ్లాట్ కేవలం ఆయన పెంపుడు కుక్కలకోసమే ఉందట.

మంత్రి పార్థా చటర్జీ జంతు ప్రేమికుడు. ఆయనకు పెంపుడు కుక్కలంటే బాగా ఇష్టం. ఎంత ఇష్టమంటే వాటికోసం ఏకంగా ఓ ఫ్లాట్ కొనుగోలు చేసేంత. ఆ ఫ్లాట్ లో కేవలం ఆయన పెంపుడు కుక్కలు మాత్రమే ఉంటాయ. పనివాళ్లు ఉంటారు. ఎప్పుడైనా ఆయన వెళ్లి వాటిని చూసి వస్తుంటారు. సహజంగా ఎవరైనా కుక్కలకోసం ఫామ్ హౌస్ కట్టుకుంటారు, అందులో వాటిని ఉంచుతారు. కానీ పార్థా చటర్జీ మాత్రం ఖరీదైన ఫ్లాట్ కొనుగోలు చేశారు, పని మనుషుతలో ఆ ఫ్లాట్ లో కుక్కల్ని ఉంచేవారు. పూర్తిగా అన్ని రూమ్ లు ఎయిర్ కండిషన్డ్ చేయించారట. కుక్కలకోసం ఏసీ రూములు ఏర్పాటు చేశారు. ఈడీ అధికారులు ఈ ఫ్లాట్ లు చూసి బిత్తరపోయారు. ఇక మంత్రి సన్నిహితురాలు పార్థ చటర్జీ కూడా బాగానే వెనకేసుకున్నట్టు తెలుస్తోంది. వీరిద్దరి పేరు మీద బోల్పుర్‌ లోని శాంతినికేతన్‌ అపార్ట్ మెంట్స్ లో ఫ్లాట్లు ఉన్నాయి. వాటిపై కూడా అధికారులు దృష్టిసారించారు. మొత్తమ్మీద పార్థ చటర్చీ అరెస్ట్ వ్యవహారం సంచలనంగా మారడంతోపాటు, ఇలాంటి సంచలన విషయాలు రోజుకొకటి వెలుగులోకి రావడం కూడా మరింత కలకలం రేపుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: