రాష్ట్ర రాజకీయాల్లో ఓ విషయం మాత్రం స్పష్టంగా అర్ధమవుతోంది. అదేమిటంటే జగన్మోహన్ రెడ్డికి వ్యతిరేకంగా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్, ఎల్లోమీడియా ఏకమయ్యారని. ఎంతచిన్న విషయమైనా సరే ఎల్లోమీడియా బూతద్దంలో చూపించేస్తోంది. దాన్నిపట్టుకుని చంద్రబాబు అండ్ కో పవన్ విపరీతంగా ఊదరగొడుతున్నారు. చంద్రబాబు హయాంలో జరిగిన తప్పులను కూడా జగన్ ప్రభుత్వంలో జరుగుతున్నట్లే నానా గోలచేస్తున్నారు. దాంతో ఏకకాలంలో వాళ్ళందరినీ ఎదుర్కోవటం వైసీపీ నేతలకు కష్టంగానే ఉంటోంది.





ఉదాహరణలు తీసుకుంటే రాష్ట్రం అప్పులు, రోడ్ల పరిస్ధితి, పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, గంజాయి సాగు, వ్యాపారం లాంటివి చాలానే ఉన్నాయి. చంద్రబాబు హయాంలో కూడా అడ్డదిడ్డంగా అప్పులుచేశారు. అత్యధిక వడ్డీలకు అప్పులు తెచ్చారు. రోడ్లు బాగా పాడైపోయాయి. పోలవరం ప్రాజెక్టులో పెద్దఎత్తున అవినీతి జరిగింది. నిర్మాణంకూడా నాసిరకంగానే జరిగింది. గంజాయి సాగు, వ్యాపారం దశాబ్దాలుగా జరుగుతునే ఉంది. అయితే ఎల్లోమీడియా, చంద్రబాబు, పవన్ మాత్రం జగన్ పైన మాత్రమే టార్గెట్ చేస్తున్నారు.





ఇలాంటి పరిస్దితిలో ఎల్లోమీడియా, చంద్రబాబు, పవన్ కు కేంద్రప్రభుత్వమే చెక్ పెట్టింది. అప్పుల విషయాన్ని లెక్కలతోసహా ప్రకటించింది. పోలవరం ప్రాజెక్టుకు చంద్రబాబు హయాంలో జరిగిన కంపును నివేదికరూపంలో బయటపెట్టింది. అంటే ఒకవిధంగా కేంద్రప్రభుత్వం జగన్ను వాళ్ళ దాడుల నుండి రక్షించిందనే చెప్పాలి. జగన్ అండ్ కో వాస్తవాలు ఇవి అని ఎంత మొత్తుకుంటున్నా మెజారిటి మీడియా పదే పదే తాము చెప్పదలచుకున్న అబద్ధాలనే ప్రచారం చేస్తోంది. ఇలాంటి సమయంలో జగన్ కు కేంద్రం ఇచ్చిన మద్దతు పెద్ద రిలీఫనే చెప్పాలి.






కేంద్రం ఎప్పుడైతే పోలవరంలో జరిగిన కంపును, రాష్ట్రాల అప్పులను ప్రకటించిందో జగన్ వ్యతిరేక ప్రచారానికి బ్రేకులు పడిందనే అనుకోవాలి. ఎందుకంటే ఎల్లోమీడియాలో వచ్చిందాన్ని నమ్మేస్ధితిలో ఇపుడు జనాలు లేరు. అయితే ఇదే విషయాలను కేంద్రప్రభుత్వం నివేదిక రూపంలో చెబితే జగన్ కు చాలా ప్లస్ అవుతుంది. ఇపుడు జరిగిందిదే. మరి దీన్ని జగన్ ఏ విధంగా అడ్వాంటేజ్ తీసుకుంటారో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: