చంద్రబాబానాయుడుకు విశ్వసనీయత లేదని వైసీపీ నేతలు ఎందుకంటారో ఇపుడు అర్ధమైంది. అప్పుల విషయంలో అబద్ధాలు, వరదబాధితులకు సాయంచేస్తున్న విషయంలో తప్పుడు ప్రచారాలు, పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో జగన్మోహన్ రెడ్డిపై దుష్ప్రచారం అంతా ఒక్కొక్కటిగా బయటపడుతోంది. తప్పులన్నీ, అప్పులన్నీ చంద్రబాబు చేసి వాటిని జగన్ మీదకు తోసేస్తున్నారు. ఇవన్నీ కేంద్రప్రభుత్వం తాజాగా చేసిన ప్రకటనలతో బయటపడుతున్నాయి. సంక్షోభంలోకి కూరుకుపోయిన శ్రీలంకతో ఏపీని పోలుస్తు చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా నానా రచ్చచేస్తున్న సంగతి అందరు చూస్తున్నదే. కేంద్రం ఇచ్చిన తాజా లెక్కలతో వాళ్ళు చెబుతున్నదంతా అబద్ధాలే అని తేలిపోయింది.



 

 

ఎలాగంటే అప్పుల విషయంలో ఏపీకన్నా ముందు ఏడు  రాష్ట్రాలున్నాయి. ఈ ఏడురాష్ట్రాలు శ్రీలంకలాగ మారితేకానీ ఏపీవంతు రాదు. అప్పుల్లో ఏపీకి మించున్న ఏడు రాష్ట్రాల్లో తమిళనాడు రు. 6. 59 లక్షలు, యూపీ రు. 6.53 లక్షలు, మహారాష్ట్ర రు. 6.08 లక్షల కోట్లు,  బెంగాల్ రు. 5.62 లక్షల కోట్లు, రాజస్ధాన్  రు. 4.77 లక్షల కోట్లు, కర్నాటక రు. 4.62 లక్షల కోట్లు,  గుజరాత్ రు. 4.02 లక్షల కోట్లు, ఏపీ రు. 3.98 లక్షల కోట్ల అప్పుంది.




 

ఏపీకన్నా కాస్త తక్కువగా తెలంగాణాతో పాటు చాలా రాష్ట్రాలున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత చేసిన అప్పు రు. 3.98 లక్షల కోట్లుగా క్లారిటి వచ్చేసింది. చంద్రబాబు హయాంలో కూడా సుమారు రు. 3.5 లక్షల కోట్లు అప్పయ్యింది. అంటే ఎనిమిది లక్షల కోట్ల అప్పులో 2019లో చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయేనాటికి ఉన్న నాలుగు లక్షల కోట్లు కూడా కలిసే ఉందని కేంద్రప్రభుత్వం స్పష్టంగా చెప్పింది.




 

 

చంద్రబాబు ఐదేళ్ళ పాలనలో సుమారు రు. 3 లక్షల కోట్లు అప్పుచేస్తే జగన్ మూడేళ్ళల్లో నాలుగులక్షల కోట్లు అప్పుచేశారు. రాష్ట్రవిభజన నాటి అప్పు ఎలాగుఉంది.  జగన్ మూడేళ్ళల్లో ఇంత అప్పుచేయటానికి కరోనా వైరస్+సంక్షేమపథకాలు పక్కాగా అమలు చేయటమే కారణమని వైసీపీ నేతలంటున్నారు.  దేశం అప్పే రు. 155 లక్షల కోట్లుంది కాబట్టి. కాబట్టి ఏపీ శ్రీలంకలాగ అయిపోతుందన్న ఆరోపణల్లో నిజంలేదు.


మరింత సమాచారం తెలుసుకోండి: