గతంలో వారిద్దరూ టీడీపీలో ఎమ్మెల్యేలుగా ఉన్నారు, ఆ తర్వాత వైసీపీలోకి వచ్చారు. ఇప్పుడు వారిద్దరినీ టీడీపీ టార్గెట్ చేసింది. ఇప్పుడు క్యాసినో వ్యవహారంలో వారిద్దరినీ సిరియస్ గా టార్గెట్ చేసింది టీడీపీ. గుడివాడలో క్యాసినో నిర్వహించిన చీకోటి ప్రవీణ్ ఇటీవల ఈడీ ఉచ్చులో చిక్కుకున్నారు. ఈ వ్యవహారంలో అతనితోపాటు మాధవరెడ్డి అనే వ్యక్తి కూడా దోషిగా తేలే అవకాశముంది. దీంతో చీకోటి ప్రవీణ్ కి కొడాలి నానికి, వల్లభనేని వంశీకి సంబంధాలున్నాయని టీడీపీ ఆరోపిస్తోంది. ఇక్కడ వీరి ఇళ్లలో కూడా ఈడీ సోదాలు చేయాలని అంటున్నారు టీడీపీ నేతలు.

క్యాసినో వ్యవహారంలో చీకోటి ప్రవీణ్‌ అడ్డంగా బుక్కయ్యారని అంటున్నారు. హైదరాబాద్ లో మొత్తం 8 ప్రాంతాల్లో ఈడీ సోదాలు చేసింది. చీకోటి ప్రవీణ్, మాధవరెడ్డి ఇళ్లలో సోదాలు చేశారు అధికారులు. సైదాబాద్‌, బోయిన్‌ పల్లి, కడ్తాల్‌ లో ఈడీ అధికారులు సోదాలు చేశారు. 20 గంటల పాటు తనిఖీలు చేపట్టి వివిధ కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారని తెలిసింది. ఇటీవల నేపాల్‌ లో క్యాసినో నిర్వహించినట్టు తేలింది. ప్రవీణ్‌ ల్యాప్‌ టాప్‌ తో పాటు మరికొన్ని వస్తువుల్ని కూడా స్వాధీనం చేసుకున్నారు.

ఈ వ్యవహారంలో పలువురు వీఐపీలతో పాటు, సినీ ప్రముఖులు కూడా ఉన్నట్టు తెలుస్తోంది. మాధవ రెడ్డి కారుపై తెలంగాణ నేతల స్టిక్కర్ ఉన్నట్టు కూడా నిర్థారణ అయింది. ఇటు ఏపీలోని నేతలకు, చీకోటి ప్రవీణ్ కి కూడా సంబంధాలున్నాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో వైసీపీ నేరుగా కొడాలి నాని, వల్లభనేని వంశీని టార్గెట్ చేస్తోంది. వారిద్దరికీ చీకోటి ప్రవీణ్ తో సంబంధాలున్నాయని, వారిని కూడా విచారించాలని డిమాండ్ చేస్తున్నారు టీడీపీ నేత వర్ల రామయ్య. గత సంక్రాంతి సందర్బంగా కొడాలి నాని, వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో గుడివాడలో క్యాసినో జరిగిందని దాన్ని నిర్వహించిన చీకోటి ప్రవీణ్ అని ఆరోపిస్తున్నారు టీడీపీ నేతలు. వీరితోపాటు వైసీపీకి చెందిన మరికొంతమందికి ఇందులో హస్తం ఉందని అంటున్నారు. చీకోటి ప్రవీణ్ వ్యవహారంలో వైసీపీని సీరియస్ గా టార్గెట్ చేస్తోంది టీడీపీ.

మరింత సమాచారం తెలుసుకోండి: