భద్రాచలంలో పర్యటించిన చంద్రబాబునాయుడు చేసిన వ్యాఖ్యలు చూస్తుంటే ఇపుడ ఇదే అనుమానాలు పెరుగుతోంది. వలసమండలాల్లో పర్యటించిన చంద్రబాబు పనిలోపనిగా భద్రాలచంలో కూడా పర్యటించారు. ఈ సందర్భంగా జగన్మోహన్ రెడ్డి పై నోటికొచ్చినట్లు ఆరోపణలు, విమర్శలుచేశారు. సరే ఇదంతా ఎప్పుడూ ఉండేది అనుకున్నా మరికొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలను విన్నతర్వాతే చంద్రబాబుపై అనుమానాలు పెరుగుతున్నాయి.





ఇంతకీ చంద్రబాబు చెప్పిందేమంటే హైదరాబాద్ అభివృద్ధి తనవల్లే జరిగిందన్నారు. ఇపుడు యువతకు వచ్చిన ఉద్యోగ, ఉపాధి అవకాశాలన్నీ తన కృషిగానే చెప్పుకున్నారు. తెలంగాణాలో తన పర్యటన విషయంలో అద్భుతమైన స్పందన ఉందికాబట్టి వచ్చే ఎన్నికలకు తమ్ముళ్ళంతా రెడీగా ఉండాలని పిలుపిచ్చారు. సెప్టెంబర్ 2వ వారంలో ఖమ్మంలో టీడీపీ ఆధ్వర్యంలో భారీ బహిరంగసభ నిర్వహించబోతున్నట్లు చెప్పారు. యువత భవిష్యత్తు కోసం తెలంగాణాలో టీడీపీ ఉండితీరాల్సిందే అన్నట్లుగా చెప్పారు.





సరే చంద్రబాబు చెప్పేదంతా సోదన్న విషయం తెలిసిపోతోంది. నిజంగానే టీడీపీకి అంతసీనుంటే తెలంగాణాలో ఎందుకని సమాధిలోకి వెళిపోతుంది ? కేవలం చంద్రబాబు చేతకానితనం వల్లే పార్టీ భూస్ధాపితమైపోయింది. అయితే ఇక్కడ అనుమానం ఏమిటంటే కేసీయార్ తో చంద్రబాబుకు ఏమన్నా ఒప్పందం కుదిరిందా అన్నది ? ఎందుకంటే 2014, 18 ఎన్నికల్లో చంద్రబాబును బూచిగా చూపించే కేసీయార్ అధికారంలోకి వచ్చారు. కేసీయార్ పాలనపై వ్యతిరేకత పెరిగిపోవటం వల్ల వచ్చే ఎన్నికల్లో అధికారం కష్టమనే ప్రచారం పెరిగిపోతోంది. ఒకవైపు హ్యాట్రిక్ కొట్టడానికి కేసీయార్ అవస్తలుపడుతున్న సమయంలోనే చంద్రబాబు తెలంగాణాలో పర్యటించటం ఏమిటి ? పర్యటిస్తే ఏదో బాధితులతో మాట్లాడి వెళ్ళిపోవాలి కానీ బహిరంగసభని, వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని, తమ్ముళ్ళంతా రెడీగా ఉండాలని పిలుపివ్వటం ఏమిటి ?






పార్టీ భూస్ధాపితమైపోయిన తర్వాత మళ్ళీ పోటీకి రెడీ అవుతున్నట్లు ప్రకటించారంటేనే కేసీయార్ కోసమే చంద్రబాబు రంగంలోకి దిగారా అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రేపటి ఎన్నికల్లో చంద్రబాబు తెలంగాణాలో తిరిగితే మళ్ళీ కేసీయార్ సెంటిమెంటును రగిల్చి గెలిచేందుకు ప్రయత్నిస్తారు. టీఆర్ఎస్ గనుక గెలిస్తే అది చంద్రబాబు పుణ్యమే అవుతుందనటంలో సందేహంలేదు. అందుకనే ఇద్దరిమధ్య ఒప్పందం ఏమన్నా కుదిరింది అనే అనుమానాలు పెరిగిపోతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: