ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబునాయుడుపైన కాంగ్రెస్ సీనియర్ నేత కేవీపీ రామచంద్రరావు, వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు తరచూ ఒక ఆరోపణ చేస్తుంటారు. అదేమింటటే అల్జిమర్స్ సమస్యతో బాధపడుతుంటారని. అందుకనే చంద్రబాబు ఆరోపణలన్నీ సీజనల్ గా మారిపోతుంటాయి. ఇపుడు చంద్రబాబు దృష్టంతా శ్రీలంక సంక్షోభం మీదుంది. ఏపీలో కూడా శ్రీలంకలో పరిస్ధితుల్లాగే ఉందంటు నానా గోలచేస్తున్నారు.





నిజానికి శ్రీలంకలో పరిస్ధితులకు ఏపీకి సంబంధంలేదని చంద్రబాబుకు బాగా తెలుసు. అయినా జగన్మోహన్ రెడ్డిపై బురదచల్లేందుకు చంద్రబాబు, ఎల్లోమీడియాకు ఏదో ఒక అంశంకావాలి. అందుకనే శ్రీలంకను ఎత్తుకున్నారు. ఇక్కడ విషయం ఏమిటంటే ఏ విషయమైతే క్యాచీగా ఉంటుందో వెంటనే దాన్ని చంద్రబాబు అందుకుంటారు. తాను పదే పదే ప్రస్తావిస్తున్న అంశాలతో జనాలకు సంబంధముందా లేదా అనేదాన్ని పట్టించుకోరు. దానికి తాజా ఉదాహరణ ఏమిటంటే కోనసీమలో వరద బాధితులను పరామర్శించినపుడు కూడా శ్రీలంకలో పరిస్ధితుల గురించే మాట్లాడారు.





కొద్దిరోజుల క్రితం వరకు ఏపీని డ్రగ్ మాఫియాగా మార్చేశారంటు గోలచేశారు. రాష్ట్రంలో గంజాయి, డ్రగ్స్ దొరుకుతుండటంతో అదే పాటందుకున్నారు. నిజానికి తన హయాంలో కూడా గంజాయి సాగు, అమ్మకాలు విపరీతంగా జరిగాయి. అయినా దాన్ని అంగీకరించకుండా కొంతకాలం పాటు అదేపనిగా డ్రగ్ మాఫియా అంటు నానా ఊదరగొట్టారు. తర్వాత ఆ విషయం మరుగునపడిపోగానే ఎస్సీ, ఎస్టీలు, మహిళలపై దాడులంటు నానా గోలచేశారు. తర్వాత ఆ విషయం కూడా పక్కకుపోయింది. మధ్యలో కొంతకాలం అక్రమమైనింగ్ అంటు గోలచేశారు.






మధ్య మధ్యలో పోలవరం ప్రాజెక్టని, అమరావతని రచ్చ చేస్తునే ఉంటారు. అంటే చంద్రబాబు ఏ విషయాన్ని పట్టుకున్నా కేవలం కొద్దిరోజులు మాత్రమే గోలచేస్తారు. తనకు మద్దతిచ్చే మీడియా ఎలాగు ఉందికాబట్టి వాళ్ళుచేసే గోల చాలా హైలైట్ అవుతుంది. తర్వాత అంతా మామూలుగానే కామ్ అయిపోతుంది. కాబట్టి ఇపుడు శ్రీలంక, పోలవరం, వలసమండలాల గోలనడుస్తోంది. ఇదెంతకాలం నడుస్తుందో ? మరో కొత్త ఇష్యు ఎప్పుడు వస్తుందో చూడాలి.






మరింత సమాచారం తెలుసుకోండి: