ఎంచి చావు సుబ్బి పెళ్ళకివచ్చిందనే సామెతలాగ తయారైపోయింది కోమటిరెడ్డి వెంకటరెడ్డి వ్యవహారం. భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెకంటరెడ్డి, మునుగోడు ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి స్వయాన అన్నదమ్ములన్న విషయం తెలిసిందే. ఏ విషయంలో అయినా ఇప్పటివరకు ఇద్దరిదీ ఒకటే మాట ఒకటే బాటగా ఉండేది. వీళ్ళద్దరు కోమటిరెడ్డి బ్రదర్స్ గా  బాగా పాపులర్.

అలాంటిది  బీజేపీలో  చేరే విషయంలో మొదటిసారి  కోమటిరెడ్డి బ్రదర్స్ మధ్య విభేదాలు వచ్చినట్లు సమాచారం. బీజేపీలో చేరాలని రాజగోపాల్ రెడ్డి నిర్ణయించుకుంటే కాంగ్రెస్ లోనే కంటిన్యు అవ్వాలని వెంకటరెడ్డి డిసైడ్ అయ్యారు. దీంతో వీళ్ళ ఆలోచనల్లో బాగా మార్సొచ్చేసింది. ఇద్దరి మధ్యా అంతర్గత చర్చలు ఏమి జరగిందనేది ఎవరికీ తెలీదు. అయితే రాజగోపాల్ నిర్ణయంపై అన్న వెంకటరెడ్డి ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు.

సరిగ్గా ఈ పరిస్ధితినే కాంగ్రెస్ అధిష్టానం అడ్వాంటేజ్ గా తీసుకుంటోంది. అదేమిటంటే రాజగోపాల్ రాజీనామా చేసి, అది ఆమోదంపొంది ఉపఎన్నిక వచ్చిందే అనుకుందాం. అప్పుడు ఆ ఉపఎన్నికలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్ధిని గెలిపించే బాధ్యత అన్న వెంకటరెడ్డి మీదే పెట్టాలని అధిష్టానం డిసైడ్ అయ్యిందట.  పనిలోపనిగా అసలు వెంకటరెడ్డినే తమ్ముడికి వ్యతిరేకంగా పోటీలోకి దింపితే ఎలాగుంటుందని కూడా ఆలోచిస్తున్నట్లు సమాచారం. నిజంగా ఈ రెండింటిలో ఏది జరిగినా అన్నదమ్ములకు ఇద్దరికీ ఇబ్బంది తప్పదు. అయినా పార్టీమార్పు కోసమే రాజీనామ చేస్తున్న రాజగోపాల్ కు జనాలు ఓట్లేసేది అనుమానమేనట.


పార్టీ అధిష్టానం తనపై మోపిన భారాన్ని నెరవేర్చాలంటే వెంకటరెడ్డికి  ఒకసమస్య. అసలు తమ్ముడిపైనే పోటీకి దిగటమంటే అది ఇంకా పెద్ద సమస్యగా మారుతుంది. రాజకీయాలే కాదు అన్నదమ్ములిద్దరు కలిసే వ్యాపారాలు చేస్తుంటారు.  కాంగ్రెస్ కు రాజీనామా చేసి ఉపఎన్నికలో రాజగోపాల్ పోటీచేస్తే వీళ్ళ జాయింట్ వ్యాపారాలు దెబ్బతినటమే కాకుండా దాని ప్రభావం కుటుంబాలపైన కూడా పడే అవకాశాలు ఎక్కువగా ఉంది. మరీ సమస్యలను అన్నదమ్ములు ఎలాగ అధిగమిస్తారో ? బాధ్యత తీసుకోకపోతే కాంగ్రెస్ లో వెంకటరెడ్డి పరువుపోతుంది. బాధ్యత తీసుకుని కాంగ్రెస్ అభ్యర్ధిని గెలిపించుకుంటే తమ్ముడితో సంబంధాలు చెడుతుంది. మరి చివరకు కోమటిరెడ్డి బ్రదర్స్ ఏమిచేస్తారో చూడాలి.


 

మరింత సమాచారం తెలుసుకోండి: