అల్-ఖైదా చీఫ్ అల్ జవహరిని అమెరికా హతమార్చింది. అమెరికా జరిపిన ద్రోన్ దాడిలో జవహరి చనిపోయినట్లు వైట్ హౌస్ లో అధ్యక్షుడు జో బైడెన్ స్వయంగా చెప్పారు. దాదాపు పదేళ్ళుగా యావత్ ప్రపంచాన్ని జల్లెడ పట్టి అమెరికా నిఘా అధికారులు వెతుకుతున్నారు. బిన్ లాడెన్ చనిపోయిన తర్వాత ఈజిప్టులో మంచి సర్జన్ అయిన అల్ జవహరి తీవ్రవాద సంస్ధకు చీఫ్ గా బాధ్యతలు స్వీకరించారు. లాడెన్ను చంపినట్లే జవహరినీ కూడా చంపేందుకు అమెరికా ఎంత ప్రయత్నించినా సాధ్యంకాలేదు.

సంవత్సరాల తరబడి వెతుకుతున్న అమెరికాకు జవహరి తనంతట తానుగానే దొరికిపోయారు. అంటే కావాలని అమెరికాకు దొరకలేదు అయితే ఆయనకున్న అలవాటే అమెరికా నిఘాసంస్ధలకు ఉప్పందించింది. జవహరిని ఎలాగైనా చంపాలనే పట్టుదలతో భూమి మీదే కాకుండా అమెరికా శాటిలైట్ల సాయంతో కూడా జల్లెడ పడుతోంది. ఇలాంటి సమయంలో ఈ మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు నేత కాబూల్ శివార్లలోని ఒక ఇంటిలో ఉన్నట్లు శాటిలైట్ నుండి సమాచారం అందిదట.

జవహరిని శాటిలైట్ ఎలా కనిపెట్టింది ? ఎలాగంటే ఇప్పటికే జవహరి ఫొటోలను శాటిలైట్ సమాచార వ్యవస్ధలో అప్ లోడ్ చేసుంచారు. తనదగ్గర ఫొటోలోని వ్యక్తి ప్రపంచంలో ఏ మూల కనిపించినా వెంటనే నిఘా విభాగానికి ఆ సమాచారాన్ని శాటిలైట్ చేరవేస్తుంది. దాన్ని పట్టుకుని అమెరికా నిఘా విభాగం విశ్లేషణలు చేసుకుని సదరు వ్యక్తి జవహరియా కాదా అని తేల్చుకుంటుంది. ఇలాంటి సమాచారమే అమెరికాకు తాజాగా అందింది.


కాబూల్ సమీపంలోని ఒక బంగ్లాపైన జవహరి ఎండలో వాకింగ్ చేస్తున్న కొన్ని ఫొటోలను పంపించింది.  తమకు అందిన ఫొటోలను నిఘా విభాగం విశ్లేషించింది. తాము వెతుకుతున్న మోస్ట్ వాంటెడ్ టెర్రరిస్టు జవహరియే అని నిర్ధారించుకున్నాయి. వెంటనే టార్గెట్ ను ఫినిష్ చేయటానికి వీలుగా ద్రోన్ మిసైల్స్ ను ఉపయోగించింది. వార్ హెడ్ ను తొలగించి నాలుగు పదునైన బ్లేడ్లను  అమర్చిన  హెల్ ఫైర్ అనే ఈ మిస్సైల్ టార్గెట్ చేరుకోగానే  ఒక్కసారిగా నాలుగు బ్లేడ్లు తెరుచుకుని జవహరి శరీరాన్ని ముక్కలు ముక్కలుగా ఛిద్రంచేసేశాయి. సింపుల్ ఎలాంటి పేలుళ్ళు లేకుండానే ఇంట్లోని మిగిలిన వాళ్ళకి ఏమిజరిగిందో కూడా తెలీకుండానే పనిపూర్తయిపోయింది. ఉదయం పూట ఎండలో వాకింగ్ చేయకుండా ఉండుంటే జవహరిని అమెరికా ఇంకా ఎంతకాలం వెతుకుతుండేదో.

మరింత సమాచారం తెలుసుకోండి: