ప్రస్తుతానికి ఈ రెండు నియోజకవర్గాల్లోని నేతలు చంద్రబాబునాయుడుకు బాగా తలనొప్పిగా తయారయ్యారట. ఈమధ్యనే విజయవాడ, గుంటూరు పార్లమెంటు నియోజకవర్గాలకు చెందిన నేతలు చంద్రబాబుతో భేటీ అయ్యారట. వచ్చే ఎన్నికల్లో ఎంపీలుగా పోటీచేయబోయేది ఎవరనే విషయంలో తమకు క్లారిటి కావాలని గట్టిగానే తగులుకున్నారని సమాచారం. నిజానికి ఈ రెండు నియోజకవర్గాల్లో ఎంపీలుగా పోటీచేయబోయేది ఎవరనే విషయంలో బాగా అయోమయం పెరిగిపోతోంది.

ఇంత అయోమయం పెరిగిపోవటానికి కారణం చంద్రబాబే. అందుకనే రెండు నియోజకవర్గాలకు చెందిన అనేకమంది నేతలు వచ్చి క్లారిటి కావాలని పట్టుబట్టారట. విజయవాడ విషయమే తీసుకుంటే ఎంపీ కేశినేని ఉండగానే చంద్రబాబు ఆయన తమ్ముడు కేశినేని చిన్నీని ఎంకరేజ్ చేస్తున్నారు. అంటే అన్నకు పోటీగా స్వయంగా చంద్రబాబే తమ్ముడిని రంగంలోకి దింపారు. దీంతో వాళ్ళిద్దరి మధ్య గొడవలు పెరిగిపోయి చివరకు పోలీసుస్టేషన్లో కేసులు పెట్టుకునేదాకా వెళ్ళిపోయింది వ్యవహారం.

వచ్చే ఎన్నికల్లో నాని పోటీచేసేది లేనిది  చంద్రబాబు మాట్లాడుండాల్సింది. ఎంపీ చెప్పిన విషయాన్ని బట్టి ఏదో ఒక నిర్ణయం తీసుకునుంటే బాగుండేది. కానీ చంద్రబాబు-ఎంపీ మధ్య ఏమి జరిగిందో తెలీదుకానీ ఇద్దరు నియోజకవర్గాల్లో తిరుగుతున్నారు. దాంతో అందరిలోను కన్ఫ్యూజన్ పెరిగిపోతోంది. ఇద్దరిలో ఎవరికి మద్దతుగా నిలబడాలో ? ఎవరితో నియోజకవర్గాల్లో తిరగాలో నేతలకు అర్ధం కావటంలేదు. అందుకనే చంద్రబాబును నేతలు గట్టిగా తగులుకున్నారు.


ఇక గుంటూరు వ్యవహారం కూడా ఇలాగే ఉంది. గల్లా జయదేవ్ నియోజకవర్గంలో కానీ పార్టీలో కానీ పెద్దగా యాక్టివ్ గా లేరు. అలాగని ప్రత్యామ్నాయం చూద్దామంటే కుదరటంలేదు. ఎందుకంటే ఎంపీ సీటులో పోటీచేయాలంటే తక్కువలో తక్కువ వంద కోట్ల రూపాయలు ఖర్చు చేయాల్సుంటంది. ఇపుడు ఎవరైనా ముందుకు వచ్చినా చివరి నిముషంలో చంద్రబాబు టికెట్ ఇస్తారనే గ్యారెంటీకూడా లేదు. టికెట్ వస్తుందనే నమ్మకంతో ఎవరైనా ఖర్చులు పెట్టేస్తే చివరలో టికెట్ రాకపోతే తమ పరిస్ధితి ఏమిటనే ప్రశ్నకు సమాధానం రావటంలేదు. అందుకనే ఖర్చుకు ఎవరు ముందుకు రావటంలేదు. ఈ విషయంలోనే రెండు నియోజకవర్గాల నేతలు గట్టిగా తగులుకున్నారట.


మరింత సమాచారం తెలుసుకోండి: