మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాలరెడ్డి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. పార్టీతో పాటు ఎంఎల్ఏ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. మీడియా సమావేశంలో మాట్లాడిన రాజగోపాల్ రెండుపాయింట్లే వినిపించారు. అవేమిటంటే మొదటిది టార్గెట్ పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి. రెండో పాయింట్ కేసీయార్ కుటుంబపాలన. దాదాపు గంటన్నరపాటు మాట్లాడినా అంతా పిచ్చి లాజిక్ తప్ప మరోటి వినబడలేదు.





రాజగోపాల్ వినిపించిన పిచ్చి లాజిక్ ఏమిటంటే..కేసీయార్ కుటుంబపాలనకు తాను వ్యతిరేకమట. కేసీయార్ పాలనలో రాష్ట్రం అభివృవద్ధి జరగలేదట. టీఆర్ఎఎస్ ప్రభుత్వంలో తన నియోజకవర్గం ఏమాత్రం అభివృద్ధి జరగలేదట. కేసీయార్ పాలనలో తెలంగాణా జనాలకు ఆత్మగౌరవం లేకుండాపోయిందట. ఏ లక్ష్యంతో అయితే పోరాటాలుచేసి తెలంగాణా సాధించుకున్నామో అది నెరవేరటంలేదట. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేనపుడు ఎంఎల్ఏగా ఉండి ఉపయోగం ఏమిటని ఆలోచించి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యారట.





ఇలాంటి పిచ్చి లాజిక్కులు చాలా వినిపించారు.  కేసీయార్ పాలనకు నిరసనగా రాజీనామా చేస్తున్నట్లు టీఆర్ఎస్ ఎంఎల్ఏనో లేకపోతే మంత్రో ప్రకటిస్తే అర్ధముంది. అంతేకానీ ప్రతిపక్షంలో ఉన్న  రాజగోపాల్ రాజీనామా చేస్తే ఏమవుతుంది ? రాజీనామా చేస్తే భయపడిపోయి మునుగోడును కేసీయార్ డెవలప్ చేసేస్తారా ?  కేసీయార్ పాలనలో జనాలకు ఆత్మగౌరవం లేదని చెప్పటంలో కూడా అర్ధంలేదు. ఎందుకంటే రెండుసార్లు జనాలు కేసీయారే కావాలని టీఆర్ఎస్ ను గెలిపించుకున్న తర్వాత మధ్యలో రాజగోపాల్ బాధమేటి ?






తమ ఆత్మగౌరవానికి భంగం కలిగిందని అనుకోవాల్సింది జనాలే కానీ రాజగోపాల్ కాదు. ఇక రేవంత్ పేరెత్తకుండానే టార్గెట్ చేశారు. సోనియాను 20 ఏళ్ళు తిట్టిన వాళ్ళకి, బయటపార్టీ వ్యక్తికి పీసీసీ ఇస్తారా ? అని అడగటంలో కూడా అర్ధంలేదు. తనను తిట్టిన రేవంత్ కు పీసీసీ పగ్గాలు అప్పగించాలని స్వయంగా సోనియానే అనుకున్న తర్వాత మధ్యలో రాజగోపాల్ బాధేమిటి ? తన సోదరుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పీసీసీ పగ్గాలు అప్పగించలేదన్న బాధ రాజగోపాల్లో బాగా కనబడుతోంది. ఇంత మాట్లాడిన ఎంఎల్ఏ బీజేపీలో చేరే విషయమై ఇంకా నిర్ణయం తీసుకోలేదని చెప్పటమే కొసమెరుపు.

మరింత సమాచారం తెలుసుకోండి: