మునుగోడు ఎంఎల్ఏగా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించి కోమటిరెడ్డిరాజగోపాల్ పెద్ద సస్పెన్సుకు తెరదించారు. సో ఉపఎన్నిక ఎప్పుడు వచ్చినా ఎదుర్కొనేందుకు కాంగ్రెస్ రెడీ అయిపోతోంది. ఎలాగూ బీజేపీలోనే రాజగోపాల్ చేరుతారు కాబట్టి ఆ పార్టీకి కూడా అభ్యర్ధి రెడీమేడుగానే ఉన్నారు. ఎటొచ్చి సమస్యంతా కేసీయార్ కే చుట్టుకుంటోంది. ఎంఎల్ఏ రాజీనామాను ఆమోదిస్తే ఒక సమస్య, ఆమోదించటంలో ఆలస్యమయ్యేకొద్దీ మరో సమస్య.





విషయం ఏమిటంటే రాజీనామా చేయటం రాజగోపాల్ చేతిలో ఉంది. కాబట్టి రాజీనామా చేయటం వరకు ఓకే. ఆ రాజీనామాను యాక్సెప్ట్ చేయాల్సింది స్పీకర్. కేసీయార్ అనుమతి లేకుండా స్పీకర్ ఆపనిచేయలేరు. కాబట్టి ఎంతకాలమని రాజీనామాను ఆమోదించకుండా స్పీకర్ అట్టిపెట్టుకుంటారన్నదే ఇక్కడ సమస్య. రాజీనామా ఆమోదానికి కేసీయార్ ఎప్పుడు గ్రీన్ సిగ్నల్ ఇస్తారంటే మునుగోడులో గెలుపుకు పార్టీకి అన్నీవిధాలుగా పరిస్ధితులు సానుకూలంగా ఉన్నాయని తెలిసిన తర్వాతనే.






అంటే అప్పటివరకు రాజగోపాల్ రాజీనామాను ఏదో కారణంచెప్పి అట్టే ఉంచేస్తారు. గతంలో ఈటల రాజేందర్ ను పార్టీలో నుండి బయటకు తరిమేసిన కేసీయార్ రాజీనామా చేయాలని మంత్రులు, ఎంఎల్ఏలతో రోజు ఈటలను నానా మాటలన్నారు. చివరకు ఉపఎన్నికలో ఈటెల గెలవటంతో ఇప్పటివరకు కేసీయార్ ఆ దెబ్బనుండి కోలుకోలేదు. అప్పుడేమో రాజీనామా చేసేంతవరకు ఈటెలను వెంటాడారు. ఈటెల రాజీనామా చేయగానే ఆగమేఘాల మీద స్పీకర్ యాక్సెప్ట్ చేసేశారు.






మరిపుడు అదే పద్దతిని రాజగోపాల్ విషయంలో స్పీకర్ ఎందుకు చేయటంలేదనే ప్రశ్న మొదలవుతుంది. రాజగోపాల్ రాజీనామాను స్పీకర్ యాక్సెప్ట్ చేయకపోతే కేసీయార్ ను గట్టిగా అంటుకుంటారదరు. ఒకవేళ రాజీనామాను స్పీకర్ యాక్సెప్ట్ చేస్తే ఉపఎన్నికకు పార్టీ సిద్దంగా లేకపోతే మళ్ళీ రెండోసారి కూడా ఎదురుదెబ్బ తప్పదు. దీని ప్రభావం వచ్చే ఎన్నికలపై పడటం ఖాయం. రాజీనామాను యాక్సెప్ట్ చేయకపోతే బీజేపీ, కాంగ్రెస్ వెంటపడతాయి. యాక్సెప్ట్ చేస్తే ఉపఎన్నికలో పార్టీ గెలుస్తుందో లేదో తెలీదు. దాంతో ఏమిచేయాలనే విషయంలో కేసీయార్ కు పెద్ద సమస్యే వచ్చిపడింది.


 

మరింత సమాచారం తెలుసుకోండి: