నరేంద్రమోడీ ప్రభుత్వం దేశంలోని జనాలందరికీ ఒకేసారి పెద్ద షాకివ్వబోతోంది. అదేమిటంటే వంటగ్యాస్ పై సబ్సిడీని నూరుశాతం ఎత్తేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు పెట్రోలియం, గ్యాస్ మంత్రిత్వ శాఖ ప్రధానికి ప్రతిపాదనలు పంపిందట. కోట్లాదిమంది జనాలకు గ్యాస్ సిలిండర్లపై సబ్సిడీ ఇవ్వటం వల్ల గ్యాస్, పెట్రోలు కంపెనీలతో పాటు మంత్రిత్వశాఖకు వేల కోట్ల రూపాయల నష్టాలు వస్తున్నాయట. ఈ నష్టాలను భరించేందుకు కంపెనీలు కానీ మంత్రిత్వ శాఖ కానీ సిద్ధంగా లేదట.





కాబట్టి వంటగ్యాస్ పై సబ్సిడీని పూర్తిగా ఎత్తేస్తేకానీ కంపెనీలు, మంత్రిత్వశాఖ ఆర్ధికంగా కోలుకునే అవకాశాలు లేవని శాఖ ఉన్నతాదికారులు స్పష్టంగా చెప్పేశారు. ప్రతిపాదన వెళ్ళిందంటే తొందరలోనే మోడీ దానికి ఆమోదం చెప్పటం ఖాయమే. ఎందుకంటే ఈమధ్య మోడీ ఎక్కడ మాట్లాడినా ఉచితాలు, సబ్సిడీలు ఉండకూడదని చెబుతున్న విషయం అందరు వింటున్నదే. ఇప్పటికే ఉజ్వల పథకం కింద రెండో సిలిండర్ ను దాదాపు కోటిమంది లబ్దిదారులు తీసుకోలేదని స్వయంగా మంత్రిత్వశాఖే పార్లమెంటులో ప్రకటించింది.





కోటిమంది లబ్దిదారులు రెండో సిలిండర్ ను ఉజ్వల పథకంలో ఎందుకు తీసుకోలేదంటే దాని ధరను భరించలేకే. సరే పేదలసంగతి వదిలేస్తే సంవత్సరాలుగా అలవాటుపడిపోయిన మధ్య, ఎగువమధ్య తరగతి జనాలైతే గ్యాస్ ధర ఎంతపెరిగినా, సబ్సిడీని ఎత్తేసినా చేయగలిగేదేమీ లేదు. ఎందుకంటే గ్యాస్ ధర పెరిగిందని మళ్ళీ కట్టెలు, బొగ్గు, పిడకల పొయ్యిలకు వెళ్ళలేరు. ఈ విషయం మోడీ సర్కార్ కు బాగా తెలుసు.






అందుకనే తొందరలోనే గ్యాస్ వాడుతున్న 35 కోట్లమందిని ఒకేసారి బాదాలని డిసైడ్ అయిపోతోందట. తాను చాయ్ వాలా అని చెప్పుకుంటారు కానీ దేశంలో పేదలు, మధ్య తరగతి జనాల సంక్షేమం గురించి ఆలోచించింది చాలా తక్కువే. ఒకవైపేమో పెద్ద పెద్ద కార్పొరేట్లు, పారిశ్రామికవేత్తలు తీసుకున్న లక్షల కోట్లరూపాయల అప్పులను మాఫీ చేస్తున్నారు. ఇంకేవైపేమో పేదలు, మధ్య, ఎగువమధ్య తరగతి జనాలకు ఇస్తున్న సబ్సిడీల వల్లే కేంద్రం ఆదాయం  పడిపోతున్నదని గోల చేస్తున్నారు.  





మరింత సమాచారం తెలుసుకోండి: