తెలుగుదేశంపార్టీ విషయంలో బీజేపీ అగ్రనేతల వైఖరిలో ఎలాంటి మార్పురాలేదని పై ఫొటో చూస్తేనే అర్ధమైపోతోంది. ఒకపార్టీ నుండి నలుగురు ఎంపీలు తనను  కలవటానికి వస్తే కనీసం లేచినిలబడను కూడా నిలబడలేదు హోంశాఖ మంత్రి అమిత్ షా. అమిత్ కూర్చునే వారందరికీ నమస్కారం పెట్టారు. అసలు తమను లోపలకు రానిచ్చిందే పదివేల్లన్నట్లుగా నలుగురు ఎంపీలు చాలా మర్యాదగా, నమ్రతగా హోంశాఖ మంత్రితో మాట్లాడి బయటకు వచ్చేశారు.





ఇంతకీ విషయం ఏమిటంటే ఉపరాష్ట్రపతిగా ఎన్డీయే తరపున పోటీచేస్తున్న జగదీప్ ధనకర్ కు మద్దతివ్వాలని టీడీపీ నిర్ణయించింది. ఈ నిర్ణయాన్ని చెప్పేందుకని నలుగురు ఎంపీలు కనకమేడల రవీంద్రకుమార్, గల్లా జయదేవ్, కేశినేని నాని, కింజరాపు రామ్మోహన్ నాయుడు అమిత్ షా దగ్గరకు వెళ్ళారు. నిజానికి రాష్ట్రపతి అభ్యర్ధిగా పోటీచేసిన ద్రౌపదిముర్ముకు అయినా ఇపుడు ధనకర్ కు అయినా మద్దతివ్వమని టీడీపీని బీజేపీలో ఎవరు అడగలేదు.





నరేంద్రమోడీ, అమిత్ షా కానీ లేదా కనీసం జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా కూడా చంద్రబాబుకు ఫోన్ చేసి మద్దతు అడగలేదు. అయినాసరే మోడీని ప్రసన్నం చేసుకునేందుకని చంద్రబాబు తనంతట తానుగానే మద్దతు ప్రకటించేశారు. అడగకుండానే మద్దతు ప్రకటించింది కాబట్టే టీడీపీ అంటే బాగా అలుసైపోయినట్లుంది. అందుకనే పార్టీ తరపున నలుగురు ఎంపీలు వచ్చినా హోంమంత్రి కనీసం లేవను కూడా లేవలేదు. సోఫాలో కూర్చునే నమస్కారం పెడితే ఎంపీలు నిలబడే మాట్లాడుతున్నారు.






ఎంపీలు ఇలాగ ఎంతసేపు నిలబడి మాట్లాడారో తెలీదుకానీ ఈ ఫొటో బయటకు వచ్చిన తర్వాత మాత్రం టీడీపీ పరువంతాపోయిందన్నట్లుగా సోషల్ మీడియా రెచ్చిపోతోంది. తమను బీజేపీ ఇంతగా అవమానిస్తున్నా తమనుకాదు అవమానించిందన్నట్లుగా తుడిచేసుకుని నవ్వుమొహంతో మాట్లాడటాన్ని నెటిజన్లు తప్పుపడుతున్నారు. అడగకుండానే మద్దతు ప్రకటించిన టీడీపీకి ఈ శాస్తి జరగాల్సిందే అన్నట్లుగా నెటిజన్లు రెచ్చిపోతున్నారు. సో అమిత్ షా దగ్గర జరిగింది చూసిన తర్వాత చంద్రబాబునాయుడు విషయంలో బీజేపీ అగ్రనేతల వైఖరిలో ఎలాంటి మార్పు రాలేదని అర్ధమైపోతోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: