వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ప్రతి నియోజకవర్గంలోని కార్యకర్తలతో భేటీ అవుతానని జగన్మోహన్ రెడ్డి ప్రకటిస్తే బ్రహ్మాండమని అనుకున్నారు. కానీ ఆ సంతోషం మొదటిసమావేశం కుప్పం నియోజకవర్గంతోనే  ఎగిరిపోయింది. పార్టీలోని ద్వితీయశ్రేణి నేతలు, కార్యకర్తలు అనుకున్నది వేరు జగన్ చేసిందివేరు. ఇంతోటిదానికి ఎందుకింత ఆర్భాటపు ప్రకటనలంటు ఇపుడు పార్టీజనాలు భోరుమంటున్నారు. కుప్పం నియోజకవర్గంలోని కార్యకర్తలతో జగన్ నిర్వహించిన భేటీ పద్దతి చాలామందికి నచ్చలేదు.





నిజానికి నియోజకవర్గంలోని 60 మంది కార్యకర్తలతో జగన్ భేటీ అవుతారని అనగానే నియోజకవర్గంలోని సమస్యలు, పార్టీ, ప్రభుత్వంపై ఫీడ్ బ్యాక్ తీసుకుకోవటం కోసమే కార్యకర్తలతో జగన్ భేటీ అవబోతున్నారని చాలామంది అనుకున్నారు. నిజంగా ఇదిమంచి పరిణామమేఅని గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా కార్యకర్తలతో ఇలాంటి భేటీలు నిర్వహించింది లేదనే అనుకున్నారు. తీరా కార్యకర్తలతో భేటీ వన్ సైడ్ బ్యాటింగ్ అయిపోయింది. జగన్ చెప్పిందంతా విని కార్యకర్తలు బయటకు వచ్చేశారు.





జగన్ చెప్పిందివిని కార్యకర్తలు బయటకు వచ్చేదానికి అసలు అంతంత దూరాన్నుండి అమరావతికి పిలిపించటం దేనికి ? వీడియో కాన్ఫరెన్సులో మాట్లాడేస్తే సరిపోతుందికదానే చర్చ పెరిగిపోతోంది. కార్యకర్తలతో భేటీఅంటే వాళ్ళు చెప్పింది జగన్ వినాలికానీ రివర్సులో జరిగితే అదేమి భేటీ ? అసలెందుకీ భేటి ? పైగా కార్యకర్తల సమావేశంలో ఒకవైపు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మరోవైపు నియోజకవర్గ ఇన్చార్జి భరత్ కూర్చున్న తర్వాత ఎవరైనా ఏమన్నా చెప్పాలని అనుకున్నా ఎలా సాధ్యమని కార్యకర్తలే ప్రశ్నిస్తున్నారు.





పార్టీ, ప్రభుత్వంపై జనాల అభిప్రాయాలు ఎలాగున్నాయి ? పార్టీ గెలవాలంటే తీసుకోవాల్సిన చర్యలేంటి ? ఎంఎల్ఏ లేదా మంత్రిపై జనాల్లో ఉన్న ఫీలింగేమిటి ? అనే విషయాలపై పీడ్ బ్యాక్ ఇవ్వటానికి కార్యకర్తలు రెడీఅయ్యారు. అంతేకానీ జగన్ చెప్పిన సోదంతా వినేందుకు అంతంత డబ్బులు ఖర్చుచేసుకోవాటనికి ఎవరు సిద్ధంగా లేరని సోషల్ మీడియాలో అర్ధమవుతోంది. కాబట్టి జగన్ రెండో సమావేశం నుండైనా తన పద్దతిని మార్చుకోవాలి. లేకపోతే దండగమారి సమావేశాలు తప్ప ఎవరికీ ఉపయోగముండదు.



మరింత సమాచారం తెలుసుకోండి: