హిందుపురం ఎంపీ గోరంట్ల మాధవ్ రూపంలో పార్టీపైన పెద్ద మరకపడింది. ఏదో అడ్వర్టైజ్మెంట్లో చెప్పినట్లుగా మరకమంచిదే అన్నట్లుగా ఉండదు ఇలాంటి మరకలు. ఇలాంటి మరకలు పార్టీకి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి ఇమేజికి చాలా చెడ్డపేరుతెస్తాయి. కాబట్టి పోలీసు విచారణ, ఫోరెన్సిక్ నివేదిక లాంటి వాటికోసం వెయిట్ చేయకుండా వెంటనే ఎంపీ పదవికి మాధవ్ తో రాజీనామా చేయిస్తేనే జగన్ కు అన్నీ విధాలుగా మంచింది.





మాధవ్ పేరుతో అసభ్య వీడియో వెలుగుచూడగానే ఎంపీపై జగన్ వెంటనే యాక్షన్ తీసుకుంటే బాగుంటుందనే అభిప్రాయాలు ఎక్కువగా వినిపించాయి. ఆ వీడియో నిజమైనదేనా లేకపోతే ఎంపీ ఆరోపిస్తున్నట్లుగా మార్ఫుడా అన్నది మెల్లిగా తేలుతుంది. ఏదేమైనా మాధవ్ వ్యక్తిగత ఇమేజి, టెంపర్మెంట్ అన్నీ కలిపి జనాలముందు ఎంపీని దోషిగా నిలబెట్టాయి. కాబట్టి ఈ మరకను చెరిపేసుకోవాలంటే వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేయిస్తేనే పార్టీకి, జగన్ కు అన్నీరకాలుగా మంచింది.





ఇక్కడ ఎంపీతో రాజీనామా చేయించటం వల్ల రెండురకాలుగా జగన్ కు లాభం జరుగుతుంది. మొదటిదేమో కట్టుదాటిన ప్రజాప్రతినిధులను ఉపేక్షించేదిలేదన్న హెచ్చరిక పంపినట్లుంటుంది. ఇక రెండోదేమో ప్రజల్లో పార్టీ విషయమై ఎలాంటి ఆదరణుందో తెలుసుకునేందుకు అవకాశముంటుంది. ఎంపీ రాజీనామా ద్వారా ఉపఎన్నిక జరిగితే అప్పుడు మిగిలిన పార్టీల బండారం కూడా బయటపడుతుంది. టీడీపీ, జనసేనలు ఏమిచేస్తాయి ? బీజేపీ వైఖరి ఎలాగుంటుందనే విషయంలో కాస్త జగన్ కు క్లారిటివస్తుంది.






షెడ్యూల్ ఎన్నికలకు ముందు ఇలాంటి మరక పడటం, దాన్ని చెరుపుకునేందుకు జగన్ తీసుకోబోయే నిర్ణయం పార్టీకి ఉపయోగపడుతుందనే అనుకోవాలి. ఉపఎన్నికలో వైసీపీ గెలిస్తే ఒకరకంగాను ఓడిపోతే మరోరకంగాను విశ్లేషణకు ఉపయోగపడుతుంది. గెలిస్తే సరి అదే ఓడితే పార్టీ, ప్రభుత్వంపై జనాల్లో ఎందుకు వ్యతిరేకత మొదలైందనే విషయంలో జగన్ నిజాయితీగా విశ్లేషించుకోవాలి.  గడపగడపకువైసీపీ కార్యక్రమానికి జరగబోయే  ఉపఎన్నిక లాజికల్ కన్ క్లూషన్ గా అనుకోవాలి. కాబట్టి మాధవ్ ఉదంతంలో పార్టీకి మరింతగా డ్యామేజి పెరగకూడదంటే వెంటనే రాజీనామా చేయించటమొకటే దారి. వీడియో మార్ఫుడని తేలితే బాధ్యులపైన కూడా అంతే స్ధాయిలో యాక్షన్ తీసుకోవటానికి ఉపయోగపడుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: