మెదక్‌ జిల్లాలోని రామయంపేట మండలం ధర్మారందొంగల గ్రామానికి చెందిన మున్నీకి అతి చిన్న వయసులోనే జాఫర్ అనే వ్యక్తితో వివాహం జరిగింది. వీరి పెళ్లయిన 11 సంవత్సరాల వ్యవధిలోనే వారికి నలుగురు పిల్లలు పుట్టారు. ఇక జాఫర్ ఉపాధి విషయానికి వస్తే మటన్ కొట్టు పెట్టుకొని కుటుంబాన్ని ముందుకు నడిపిస్తున్నారు.అయితే పాపం ఉన్నఫలంగా జాఫర్ మృతి చెందడంతో మున్ని తన నలుగురు పిల్లలు అత్తమామలతో కలిసి ఉంటుంది. తన కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నటువంటి భర్త చనిపోవడంతో పిల్లల పోషణ భారమైన ఈమె గ్రామస్తుల సహకారంతో 20 సంవత్సరాల నుంచి మటన్ కొట్టు నడుపుతూ తమ జీవితాన్ని ముందుకు నెట్టుకొస్తున్నారు.ఇక ఈ విధంగా తన గ్రామంలోనే మటన్ కొట్టు పెట్టుకున్న మున్ని గ్రామస్తులందరూ కూడా తన వద్ద మటన్ కొట్టు తనకు చేదోడు వాదోడుగా నిలుస్తున్నారు.ఇలా గ్రామస్తులు అందరూ కూడా తనకు ఆర్థికంగా సహాయం చేస్తున్నప్పటికీ తన బంధువులే తనని అనగదొక్కాలని ప్రయత్నం చేస్తున్నారంటూ ఆమె వాపోయింది.


అయితే మటన్ కొట్టు వల్ల ఒకరోజు వ్యాపారం జరుగుతుంది ఇంకా మరొక రోజు జరగదు. పాపం ఈ విధంగా వచ్చిరాని ఆదాయంతో ఈమె తన నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేశారు. ఇక మటన్ షాప్ పెట్టని సమయంలో ఈమె బీడీలు చుడుతూ కూడా డబ్బులు సంపాదిస్తున్నారు.ఇక 20 సంవత్సరాల నుంచి ఇదే వృత్తిలో కొనసాగుతున్న మున్ని పెద్దగా ఆస్తుపాసులు కూడా లేవని కనీసం తనకు ఉండటానికి కూడా సొంత ఇల్లు కూడా లేదని బాధపడ్డారు. ప్రభుత్వం దయతలచి తనకు ఇల్లుని మంజూరు చేస్తే అదే అదృష్టమని ఇంకా ప్రస్తుతం తన కొడుకులు కూడా చేతికి వచ్చారని,తన కుటుంబం కోసం వారు కూడా తనకు చేదోడు వాదోడుగా ఉంటారని భావిస్తున్నాను అంటూ మున్ని తన కన్నీటి కష్టాలను తెలిపడం జరిగింది. ఇక ఈ విధంగా చిన్న వయసులోనే భర్త మరణించడంతో నలుగురు పిల్లలను పెంచి పెద్ద చేసిన ఈమె కన్నీటి గాధ తెలిస్తే నిజంగానే అందరికీ గుండె బరువెక్కుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: