నేటి రోజుల్లో టెక్నాలజీ అంతకంతకూ పెరిగిపోతోంది. ప్రతి ఒక్కరు కూడా ఆధునిక జీవనశైలి లోకి అడుగు పెడుతున్నారు. ఈ క్రమంలోనే మహిళలపై వివక్ష కూడా తగ్గిపోతుంది. ఒకప్పటితో పోలిస్తే దాదాపు నేటి రోజుల్లో మహిళలపై వివక్ష లేదు అని చెప్పాలి. ఎక్కడో కొన్ని ప్రాంతాల్లో మినహా మిగతా అన్ని ప్రాంతాలలో కూడా మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో రాణిస్తున్నారు. వ్యాపారం ఉద్యోగం చదువులు ఇలా అన్నింట్లో కూడా పురుషుల కంటే ఒక మెట్టు పైనే ఉంటున్నారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అదే సమయంలో ఇప్పటికీ కూడా కొన్ని ప్రాంతాల్లో మాత్రం మహిళలు అంటే కేవలం వంటింటి కుందేళ్లు అనే విధంగానే కొనసాగుతుంది అన్న విషయం తెలిసిందే.


 కాగా ఇప్పటి పరిస్థితి ఇలా ఉంటే దాదాపు కొన్ని దశాబ్దాల క్రితం మాత్రం మహిళలు ఇంటి గడప దాటి బయటకు వచ్చేందుకు కూడా అనుమతి ఉండేది కాదు. ఇక మహిళలు చదువుకుంటే ఏం జరుగుతుందో అని అందరూ భయపడేవారు. ఇలా మహిళలను చదువుకు దూరంగా వంటింటికి  దగ్గరగా పెంచడం చేసేవారు తల్లిదండ్రులు. ఇలా మహిళల పట్ల తీవ్రమైన వివక్షకు కొనసాగుతున్న సమయంలో కూడా ఎంతో మంది మహిళా మణులు మహిళా సాధికారత వైపు అడుగులు వేశారు. ఈ క్రమంలోనే తీవ్రమైన  వివక్ష కొనసాగుతున్న సమయంలో మొట్టమొదటి మహిళా న్యాయవాది అవతారమెత్తింది ఎవరు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.



 మన ఇండియాలో మొట్టమొదటి మహిళా న్యాయవాది గా అవతరించింది కర్నెలియా సొరబ్జి. బొంబాయి విశ్వవిద్యాలయం నుంచి మొట్టమొదటి మహిళా  పట్టభద్రురాలైన ఈమె చరిత్రలో కెక్కింది. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో మొట్టమొదటి మహిళగా న్యాయవాద విద్యను అభ్యసించింది. ఇక ఇండియాలో మొట్టమొదటి సారి నల్లకోటు ధరించి తన వాదన వినిపించిన మహిళగా పేరు ప్రఖ్యాతులు సంపాదించింది కర్నెలియా సొరబ్జి. ఇలా భారత్ లో మొట్టమొదటి న్యాయవాదిగా పేరు సంపాదించుకున్న ఈమె విగ్రహాన్ని 2012లో క్లింటన్ ఇంగ్లాండ్ లో ఆవిష్కరించడం గమనార్హం.

మరింత సమాచారం తెలుసుకోండి: