గోలి సోడా.. నేటి జనరేషన్ పిల్లలకు అయితే దీని గురించి కాస్త తక్కువగానే తెలిసి ఉంటుంది . కానీ  80, 90లలో పుట్టిన వారిని అడిగితే మాత్రం గోలీసోడా ప్రాముఖ్యత గురించి చెబుతూ ఉంటారు.  ఇటీవలి కాలంలో మనిషి దాహార్తిని తీర్చేందుకు ఎన్నో కూల్డ్రింక్స్ అందుబాటులోకి వచ్చాయి. కానీ ఒకప్పుడు మాత్రం హవా నడిపించింది మాత్రం  గోలీసోడా అనే చెప్పాలి.  ఇక ఇప్పుడు నగరాల్లో కలర్ సోడాలు పేరుతో గోలి సోడా లతో భారీ వ్యాపారం చేస్తున్నారు అని చెప్పాలి. మరి ఇలా మనందరికీ తెలిసిన గోలి సోడాకు.. ఆ పేరు వచ్చింది అసలు ఈ కూల్ డ్రింక్  చరిత్ర ఏంటో తెలుసుకుందాం..


 1872 లో ఇండియాలో హిరమ్ కాడ్ అనే ఒక ఇంగ్లాండుకు చెందిన వ్యక్తి.. కార్బొనేటెడ్ డ్రింక్స్ ను తక్కువ ధరకే జనాలకు అందించాలని అనుకున్నాడు. ఈ ఆలోచన నుంచి బయటికి వచ్చింది గోలి సోడా. బాటిల్ ను ఎంతో భిన్నంగా తయారుచేసి బాటిల్ పైభాగంలో ఒక రబ్బర్ వాపర్  ఉంచుతారు. గ్యాస్ సిలిండర్ నుంచి సోడా గ్యాస్ ను కొంత నీటితో నింపేవారు. ఇక ఆ బాటిల్ లోని గ్యాస్ను మిషన్ ద్వారా పట్టించినప్పుడు ఆ వాయువు ఉండే గోలి వాపర్ లోపలికి వెళ్ళి పోతుంది. ఇక ఈ బాటిల్ ని తయారుచేసి ప్రైవేట్ వ్యాపారులు కిల్లి కొట్లకి సప్లై  చేయడం మొదలుపెట్టారు.


 ఇలా ఏకంగా గోలి మూతగా వాడి సోడాలను తయారు చేయడం కారణంగా గోలి సోడా అనే పేరు వచ్చింది. ఈ పేరే ఈ కూల్ డ్రింక్  కి ఎంతగానో హైప్ తీసుకు వచ్చింది అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు ఇక్కడి గోలి సోడానే ఎంతో మంది హీరోలు తమ సినిమాల్లో హీరోయిజం ఎలివేట్ చేసుకోవడానికి కూడా ఉపయోగించారు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. అంతేకాదు నేటి రోజుల్లో ఎంతోమంది రకరకాల కూల్ డ్రింక్ అందుబాటులోకి ఉన్నప్పటికీ గోలి సోడా ని తాగేందుకు ఎక్కువగా ఆసక్తి చూపుతూ ఉంటారు  అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: