మునుగోడు కాంగ్రెస్ ఎంఎల్ఏ కోమటిరెడ్డి రాజగోపాల్ పంపిన రాజీనామాను స్పీకర్ పోచారం శ్రీనివాసరెడ్డి వెంటనే ఆమోదించేశారు. రాజగోపాల్ ఎంఎల్ఏగా రాజీనామా చేసి మూడు రోజులవుతోంది. దాని విషయం మాట్లాడేందుకే రాజగోపాల్ సోమవారం స్పీకర్ ను కలిశారు. ఎంఎల్ఏ కలిసిన నిముషాల వ్యవధిలోనే స్పీకర్ రాజీనామాను ఆమోదిస్తున్నట్లు ప్రకటించేశారు. ముందేమో రాజీనామాను స్పీకర్ ఆమోదిస్తారా లేకపోతే నాన్చుతారా అనే అనుమానాలు బాగా చక్కర్లుకొట్టాయి.

రాజీనామాను ఆమోదించింది స్పీకరే అయినా గ్రీన్ సిగ్నల్ రావాల్సింది మాత్రం కేసీయార్ నుండే అని అందరికీ తెలుసు. సో రాజీనామా వెంటనే ఆమోదంపొందిందంటేనే కేసీయార్ సిగ్నల్ ఇచ్చేసినట్లే అనుకోవాలి. ఇంతకీ కేసీయార్ ఇచ్చిన సిగ్నల్ ఏమిటంటే పోటీకి రెడీగా ఉన్నట్లే అని. రాజగోపాల్ వ్యవహారం చాలారోజులుగా నానుతోంది కాబట్టే బహుశా కేసీయార్ కూడా ప్రిపుర్డుగానే ఉన్నట్లున్నారు. రాజీనామా కారణంగా జరగబోయే ఉపఎన్నికలో ఎవరిని పోటీచేయించాలనే విషయంలో కచ్చితమైన క్లారిటి ఉండేవుంటుంది. కాకపోతే వ్యూహాత్మకంగా కేసీయార్ చాలా గుంభనంగా వ్యవహరిస్తున్నారు. 

కాకపోతే ఇప్పటికిప్పుడు బయటపెట్టకపోవచ్చు. ఎందుకంటే అసెంబ్లీ స్ధానం ఖాళీ అయిన విషయాన్ని అసెంబ్లీ కేంద్ర ఎన్నికల కమీషన్ కు వెళ్ళాలి. అప్పుడు కమీషన్ ఈ నియోజకవర్గంలో ఉపఎన్నిక గురించి ఆలోచిస్తుంది. వచ్చే డిసెంబర్లో గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ ఎన్నికలు జరగబోతున్నాయి. బహుశా వాటితో కలిపి మునుగోడు ఉపఎన్నిక కూడా జరిగే అవకాశముంది. ఏదేమైనా ఉపఎన్నికకు తాము రెడీగా ఉన్నామనే సిగ్నల్ అయితే కేసీయార్ పంపేశారు. కాబట్టి ఇక రెడీ అవ్వాల్సింది కాంగ్రెస్ ఇతర పార్టీలు మాత్రమే.


ఇక్కడ గమనించాల్సిందేమంటే టీఆర్ఎస్ నుండి ఉపఎన్నికలో పోటీకి ముగ్గురు నేతలు పట్టుదలగా ఉన్నారట. ఎవరు పోటీచేసినా వాళ్ళ పదవీకాలం మహాయితే ఏడాది ఉంటే ఎక్కువ. ఇంతోటిదానికి అసలు ఉఫఎన్నిక అవసరమా అని కమీషన్ భావిస్తే మాత్రం ఎవరు ఏమీచేయలేరు. ఏదేమైనా రాజగోపాల్ రాజీనామా, ఆమోదంతో ఒక్కసారిగి ఎన్నిక వాతావరణం అయితే హీటెక్కిపోయిందన్నది వాస్తవం.


మరింత సమాచారం తెలుసుకోండి: