హిందుపురం వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ వివాదాస్పద వీడియో వ్యవహారం లోక్ సభ స్పీకర్ ఓంబిర్లా కోర్టుకి చేరుకుంది. మాధవ్ పై టీడీపీ ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఫిర్యాదుచేశారు. ఒక మహిళతో ఎంపీ అసభ్యంగా ప్రవర్తించారని ఫిర్యాదుచేసిన కింజరాపు వెంటనే మాధవ్ పై యాక్షన్ తీసుకోవాలని డిమాండ్ చేయటం గమనార్హం.





వాస్తవాలను గమనిస్తే టీడీపీ ఎంపీ ఫిర్యాదుచేసినంత మాత్రాన మాధవ్ పై స్పీకర్ యాక్షన్ తీసుకునేంత సీన్ లేదు. ఎందుకంటే మాధవ్ వీడియో వివాదానికి లోక్ సభకు ఎలాంటి సంబంధంలేదు. లోక్ సభ పరిధి బయటజరిగే అంశాలపై స్పీకర్ ఎంపీలపైన ఎలాంటి యాక్షన్ తీసుకునేందుకులేదు.  నరసాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుపై అనర్హత వేటు వేయాలని వైసీపీ డిమాండ్ చేసినపుడు స్పీకర్ ఇదే విషయాన్ని స్పష్టంగా చెప్పారు.





కాబట్టి మాధవ్ విషయానికి కూడా అదే నిబంధన వర్తిస్తుంది. పైగా మాధవ్ పై ఏ మహిళకూడా ఫిర్యాదుచేయలేదు. ఇదే సమయంలో వీడియోలో కనబడిన మహిళ లోకేష్, టీడీపీ నేతలతో పాటు జనసేన నేతలపైనే ఫిర్యాదుచేసింది. మాధవ్ కూడా వైరల్ అయిన వీడియో మార్ఫుడ్ అంటున్నారు. సరే మార్ఫుడు వీడియో అయినా నిజమైన వీడియోనే అయినా మాధవ్ పై యాక్షన్ తీసుకోవటమన్నది నైతిక అంశానికి సంబంధించింది. పూర్తిగా ఎంపీకి పార్టీకి మధ్య వ్యవహారం.





కాబట్టి టీడీపీ ఫిర్యాదుచేసినంత మాత్రాన మాధవ్ పై యాక్షన్ ఉంటుందని అనుకునేందుకులేదు. పైగా ఇప్పటికే వీడియో విషయమై ఎంపీ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం అందరికీ తెలిసిందే. టెక్నికల్ అంశాలతో సంబంధంలేకుండా మాధవ్ పై యాక్షన్ తీసుకోవాలంటే అదిపూర్తిగా జగన్మోహన్ రెడ్డి నిర్ణయంపై ఆధారపడుంటుంది. ఓ నాలుగురోజులు టీడీపీ ఇలాగే గోలచేసి తర్వాత మరో విషయాన్ని పట్టుకుంటుంది. ఎందుకంటే చంద్రబాబునాయుడు అధికారంలో ఉన్నపుడు కూడా ఎంతమందిపైన ఫిర్యాదులు వచ్చినా తీసుకున్న యాక్షన్ ఏమీలేదు కాబట్టే. చివరకు ఎలాంటి వివాదమైనా చిన్నగీత పెద్దగీత లాగ అయిపోతోంది.




మరింత సమాచారం తెలుసుకోండి: