సాధారణంగా ప్రతి ఆడపిల్ల కూడా పెళ్లి చేసుకోవాలని ఎలా ఆశపడుతూ ఉంటుందో ఇక పెళ్లి జరిగిన తర్వాత అమ్మ అని పిలిపించుకోవాలని కూడా అంతే ఆశ పడుతూ ఉంటుంది. అమ్మతనాన్ని ఎంతో గొప్పగా భావిస్తూ ఉంటుంది.  తొమ్మిది నెలల పాటు ఘటన కడుపులో పెరుగుతున్న బిడ్డ ను భారంగా అనుకోకుండా ఎంతో ఆనందంగా మోస్తూ ఉంటుంది. అయితే సాధారణంగా పెళ్ళి జరిగిన కొన్నాళ్ళకి కొంతమందికి పిల్లలు అవుతూ ఉంటారు. కానీ మరికొంతమందికి మాత్రం పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా పిల్లలు పుట్టరు. ఈ క్రమంలోనే పిల్లలు పుట్టాలంటే ఎన్నో పూజలు చేయడం ఎంతో మంది డాక్టర్ల చుట్టూ తిరగటం లాంటివి చేస్తూ ఉంటారు.


 ఇక్కడ మనం మాట్లాడుకోబోయే దంపతులు కూడా ఇలాంటిదే చేశారు అని చెప్పాలి. పెళ్లయి ఏళ్లు గడుస్తున్నా వారికి పిల్లలు కాలేదు. దీంతో ఎంతో నిరీక్షణ ఎదురుచూసారు. చివరికి పెళ్లయిన 54 సంవత్సరాల కి ఆ జంట చివరికి పేరెంట్స్ గా మారిపోయారు. 70 ఏళ్ళ వయసులో వివాహిత బిడ్డకు జన్మనిచ్చింది. ఈ ఘటన రాజస్థాన్ లో జరిగింది. ఆల్వార్ లో నివాసం ఉంటున్న మాజీ సోల్జర్ గోపీచంద్ (75) చంద్రావతి (70) 1968 లో వివాహం జరిగింది. అయితే గోపీచంద్ తమ తల్లిదండ్రులకు ఏకైక సంతానం కావడం గమనార్హం.


 పెళ్లయిన తర్వాత గోపీచంద్ కి పిల్లలు కాలేదు. దీంతో తన కుటుంబం ఇక్కడితో అంతమైపోతుంది అని భయపడిపోయాడు. ఇక వీరి పెళ్లి అయి దశాబ్దాలు గడిచాయి. కానీ వీరికి మాత్రం పిల్లలు కాలేదు. దాదాపు పెళ్లయిన 54 ఏళ్ల తర్వాత ఈ జంట కల నెరవేరింది. ఇటీవల ఓ ఆస్పత్రిలో ఐవిఎఫ్ పద్ధతి ద్వారా గర్భం దాల్చింది 70 ఏళ్ల మహిళ. ఈ క్రమంలోనే తొలి రెండు ప్రయత్నాలు విఫలం అయిన  మూడో ప్రయత్నం మాత్రం సక్సెస్ అయ్యింది. దీంతో ఇటీవలే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది 70 ఏళ్ల మహిళ.

మరింత సమాచారం తెలుసుకోండి: