వచ్చేఎన్నికల్లో ఎలాగైనాసరే చంద్రబాబునాయుడును కుప్పంలో ఓడించాలనేది జగన్మోహన్ రెడ్డి పెట్టుకున్న టార్గెట్. తన టార్గెట్ విషయంలో జగన్ గోప్యతను పాటించటంలేదు. అందరిముందు బహిరంగంగానే ప్రకటించేశారు. తన టార్గెట్ ను రీచయ్యేందుకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంఎల్సీ, వచ్చే ఎన్నికల్లో అభ్యర్ధి భరత్ పై చాలాపెద్ద బాధ్యతలనే ఉంచారు. జగన్ ఆలోచనలకు అనుగుణంగానే పెద్దిరెడ్డి, భరత్ నడుచుకుంటున్నారు. ఇఫ్పటికే స్ధానికసంస్ధల ఎన్నికల్లో మంచి ఫలితాలనే చూపించారు.

దాంతో చంద్రబాబును ఖాయంగా ఓడించచ్చనే నమ్మకం జగన్లో బాగా పెరిగిపోయింది. ఈ విషయంలోనే జగన్ చాలా జాగ్రత్తగా పావులుకదుపుతున్నారు. మొదటిదేమో నియోజకవర్గంలోని ఓ 60 మంది ముఖ్యులతో సుదీర్ఘంగా సమావేశం జరిపారు. తనకు కావాల్సిందేమిటి, చేయాల్సిందేమిటనే విషయంలో జగన్ స్పష్టంగా వాళ్ళకు చెప్పారు. కుప్పం మున్సిపాలిటి డెవలప్మెంట్ కు తాజాగా రు. 65 కోట్లు విడుదల చేశారు. అలాగే ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను పక్కాగా అమలుచేయిస్తున్నారు.
అలాగే తొందరలోనే కుప్పంలో జగన్ పర్యటించబోతున్నారు. గడపగడపకు ప్రభుత్వం అనే కార్యక్రమంలో పాల్గొనాలని జగన్ డిసైడ్ అయ్యారు.  కుప్పం నియోజకవర్గం నుండి తన జిల్లాల పర్యటనను ప్రారంభించాలని ఫిక్సయ్యారట. అవకాశముంటే రెండురోజుల పాటు చిత్తూరు జిల్లాలోనే ఉండబోతున్నట్లు పార్టీవర్గాలు చెబుతున్నాయి. ఒకరోజు కుప్పంలోనే ఉండబోతున్న జగన్ మరుసటి రోజు జిల్లాలోని ఇంకేదైనా నియోజకవర్గంలో ఇదే కార్యక్రమంలో పాల్గొనాలని అనుకుంటున్నారట.

అంటే రాబోయే మూడునెలల్లో దాదాపు అన్నీజిల్లాల్లోను గడపగడపకువైసీపీ కార్యక్రమంలో పాల్గొనేందుకు జగన్ ప్లాన్ చేస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఏ విధంగా కూడా కుప్పంలో చంద్రబాబు వ్యూహాలు వర్కువుటవ్వకుండా అన్నీవైపుల నుండి బిగించేయాలన్నది జగన్ వ్యూహం. ఒకవైపు ప్రభుత్వ పరంగా చేయాల్సింది చేస్తునే పార్టీపరంగా టీడీపీలో దశాబ్దాలపాటు ఉంటున్న నేతలను వైసీపీలో చేర్చుకుంటున్నారు. అంటే గ్రామస్ధాయి నుండి నియోజకవర్గం హెడ్ క్వార్టర్స్ దాకా టీడీపీలో ముఖ్యులు అని అనుకున్న నేతల్లో వీలైనంతమందిని వైసీపీలోకి లాగేసుకోవాలన్నది ప్లాన్. ఆ ప్లాన్ మెల్లిగా వర్కవుటవుతోంది కూడా. మరి చివరకు ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: