తెలంగాణాలోని అన్నీపార్టీలు మునుగోడు ఉపఎన్నిక విషయంలో తలలు బద్దలు కొట్టుకుంటున్నాయి. ఈ నేపధ్యంలోనే దాదాపుగా తెలంగాణాలో భూస్ధాపితమైపోయిన టీడీపీ కూడా పోటీవిషయంలో ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం. తెలంగాణాలోని ముఖ్యనేతలతో చంద్రబాబునాయుడు చర్చలు జరిపారట. మునుగోడు ఉపఎన్నికలో పోటీచేయాల్సిందేఅని చాలామంది నేతలు గట్టిగానే చెప్పారట. నియోజకవర్గంలో బీసీ, ఎస్సీ, ఎస్టీలు ఎక్కువమంది ఉన్నారట.






అందుకనే పార్టీతరపున గట్టి బీసీ నేతలు పోటీలోకి దింపితే బాగుంటుందని చాలామంది సూచించినట్లు సమాచారం. దాంతో చంద్రబాబు కూడా పోటీకే సానుకూలాం స్పందించారట. దాంతో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, నియోజకవర్గ ఇన్చార్జి జక్కలి ఐలయ్య యాదవ్ పోటీకి రెడీ అవుతున్నారట. ఈయనకు అన్నీ సామాజికవర్గాలతోను మంచి సంబంధాలుండటం పార్టీకి బాగా కలిసొస్తుందని కూడా పలువురు నేతలు చంద్రబాబుకు చెప్పినట్లు సమాచారం.





ఎలాగూ తెలంగాణాలో మంచి యాక్టివ్ అవ్వాలని అనుకుంటున్న చంద్రబాబు మునుగోడు ఉపఎన్నికను వేదికగా చేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారట. ఖమ్మంలో తొందరలోనే బహిరంగసభ నిర్వహించాలని ఈమధ్యనే చంద్రబాబు పార్టీ నేతలకు చెప్పిన విషయం తెలిసిందే. నిజానికి సమైక్యరాష్ట్రంలో సీమాంధ్ర ప్రాంతంలోకన్నా తెలంగాణాలోనే టీడీపీ బలంగా ఉండేది. కాకపోతే రాష్ట్ర విభజనకు చంద్రబాబు లేఖలు ఇచ్చినా ఉపయోగంలేకపోయింది. దానిమీద 2014 ఎన్నికల్లో అధికారంలోకి వచ్చినవెంటనే కేసీయార్ ప్రభుత్వాన్ని కూలగొట్టేందుకు చంద్రబాబు చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయి.





ఆ ప్రయత్నమే ఓటుకునోటు కేసుగా దేశమంతా పాపులరై చివరకు అరెస్టు భయంతో చంద్రబాబు హైదరాబాద్ ను వదిలేసి విజయవాడ పారిపోయారు. పార్టీ అధినేత తెలంగాణాను వదిలేసి పారిపోవటంతో మిగిలిన నేతలు కూడా ఎవరిదారి వాళ్ళు చూసుకున్నారు. దాంతో తెలంగాణాలో పార్టీ ప్రస్తుతం శవాసనం వేస్తోంది. దాదాపు భూస్ధాపితమైపోయిన పార్టీకి మళ్ళీ జవజీవాలు పోయాలని చంద్రబాబు ప్రయత్నిస్తున్నట్లున్నారు. అందుకనే ఖమ్మంలో బహిరంగసభని, మునుగోడులో పోటీ అని హడావుడి చేస్తున్నారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మళ్ళీ ఒకసారి క్లారిటిగా మాట్లాడుకుందామని ఈలోగా పరిస్ధితులను గమనిస్తుండమని చెప్పారట. చూద్దాం చివరకు ఏమవుతుందో.


మరింత సమాచారం తెలుసుకోండి: