వచ్చే ఎన్నికల్లో గెలుపుకోసం కొందరు వారసులు నానా అవస్తలు పడుతున్నారు. ముఖ్యమంత్రులుగా పనిచేసిన వాళ్ళ వారసులు కొందరు రాజకీయాల్లో బాగా యాక్టివ్ గా ఉన్నారు. కాసు బ్రహ్మానందరెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి, ఎన్టీయార్, నాదెండ్ల భాస్కరరావు, చంద్రబాబునాయుడు, దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ముఖ్యమంత్రులుగా పనిచేసిన విషయం తెలిసిందే. వీరి వారసులుగా జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నారు. ఇక కాసు మహేష్ రెడ్డి గురజాల ఎంఎల్ఏగా ఉన్నారు.





ఎన్టీయార్ కొడుకుగా నందమూరి బాలకృష్ణ హిందుపురం ఎంఎల్ఏగా ఉన్నారు. కూతురు పురందేశ్వరి రాజంపేట ఎంపీగా బీజేపీ తరపున పోటీచేసి ఓడిపోయారు. మిగిలిన వాళ్ళ వారసులంతా మాజీలుగా మిగిలిపోయారు. కోట్ల విజయభాస్కరరెడ్డి కొడుకు కోట్ల సూర్యప్రకాషరెడ్డి మొన్నటి ఎన్నికల్లో కర్నూలు ఎంపీగా ఓడిపోగా ఆయన భార్య సుజాతమ్మ ఎంఎల్ఏగా ఓడిపోయారు. చంద్రబాబు కొడుకు నారా లోకేష్ మంగళగిరి ఎంఎల్ఏగా ఓడిపోయారు. పార్టీ అధికారంలో ఉన్నపుడే పోటీకి భయపడిన లోకేష్ కెపాసిటి ఏమిటో అర్ధమైపోయింది. నాదెండ్ల భాస్కరరావు కొడుకు మనోహర్ కూడా ఓడిపోయారు.






వారసుల్లో అచ్చంగా పార్టీ గాలిమీదే లోకేష్, మనోహర్, కోట్ల దంపతులు ఆధారపడ్డారు. చంద్రబాబు సీఎంగా ఉన్నపుడు మూడుశాఖలకు మంత్రిగా పనిచేసినా పార్టీ నేతలు, క్యాడర్ తో పాటు నియోజకవర్గంలో కూడా లోకేష్ కు పట్టులేదు. ఇక మనోహర్ పరిస్ధితి కూడా అంతే. కోట్ల దంపతులు కాంగ్రెస్ లో ఉన్నంతవరకు బాగానే ఉన్నారు కానీ రాష్ట్ర విభజన దెబ్బ వీళ్ళమీద బాగా కనబడుతోంది. టీడీపీలో చేరినా ఉపయోగం కనబడలేదు.






ఇక పోటిచేసిన మొదటి ఎన్నికలోనే కాసు మహేష్ రెడ్డి గెలిచినా వచ్చే ఎన్నికల్లో ఏమవుతుందో చూడాలి. అచ్చంగా వారసత్వపు హోదాతోనే రాజకీయాలు చేయాలంటే కుదరని రోజులివి. వారసత్వపు హోదా అన్నది కొంతవరకే ఉపయోగపడుతుంది. మిగితాదంతా సొంతంగా నిరూపించుకోవాల్సిందే. కోట్ల దంపతులు, లోకేష్, మనోహర్ కు సొంతంగా కెపాసిటి లేదని తేలిపోయింది. పార్టీ గాలుంటే గెలుస్తారు లేకపోతే మళ్ళీ ఓటమి తప్పేట్లులేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో వీళ్ళ అదృష్టం ఎలాగుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: