తెలంగాణ రాజకీయాలు రోజుకో విధంగా మారుతూ సెంటర్ అఫ్ అట్రాక్షన్ అవుతున్నాయి. గత రెండు సంవత్సరాలుగా వరుసగా ఉప ఎన్నికల హోరుతో తెలంగాణాలో మెయిన్ ఎలక్షన్ లు రాక ముందే రాజకీయ నాయకులకు ప్యాంట్లు తడిసిపోతున్నాయి. అయితే ఇంతకు ముందు వరకు జరిగిన ఉప ఎన్నికలు తెలంగాణ రాష్ట్రంలో అధికార ప్రభుత్వ పతనాన్ని కోరుకుంటున్నాయి. అందుకే తెరాస శ్రేణులలో గత కొంత కాలం నుండి వణుకు మొదలైంది. దీనికి తోడు కేసీఆర్ ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ను కూడా రంగంలోకి దింపాడు. ఇదిలా ఉంటే ప్రస్తుతం అందరి ద్రుష్టి మునుగోడు నియోజకవర్గం మీదనే నిలిచింది. సొంత పార్టీలో ఇమడలేక మునుగోడు కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇటీవల తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

అయితే ఈయన రాజీనామాతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యం అయింది. దీనితో మళ్ళీ అన్ని పార్టీలు అక్కడ ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు రెడీ అవుతున్నాయి. అయితే కాంగ్రెస్ తరపున గెలిచిన రాజగోపాల్ రెడ్డి ఇప్పుడు బీజేపీ తరపున పోటీ చేయడానికి సిద్ధం అవుతున్నాడని వార్తలు వస్తున్నాయి. అయితే దీనికి సంబంధించిన అధికారిక వార్త మాత్రం వెలువడలేదు. ఇక ఎప్పటిలాగే ఈ ఉప ఎన్నికలో కూడా ప్రధానంగా పోటీలో కాంగ్రెస్ , తెరాస మరియు బీజేపీలు ఉండే అవకాశం ఉంది. కానీ ప్రజావాణి ప్రకారం తెరాస కు ఈ సీట్ దక్కే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తోంది. రేవంత్ రెడ్డి తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు అయినప్పటి నుండి  ఇప్పటి వరకు తానేమిటో నిరూపించుకోలేదు.

అందుకే ఈ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థిని గెలిపించి సత్తా చాటాలని ఉవ్విళ్లూరుతున్నాడు. మరి మునుగోడు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గా గెలిచే మొనగాడు ఎవరో తెలియాలంటే ఇంకా కొంతకాలం వేచి చూడాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: