జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలుచేస్తున్న సంక్షేమపథకాలను జనసేన అధినేత పవన్ కల్యాణ్ పదే పదే ఆక్షేపిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా ఆగస్టు 15వ తేదీ స్వాతంత్ర్యదినోత్సవం సందర్భంగా మాట్లాడుతు సంక్షేమపథకాల అమలుపై తీవ్రంగా మండిపడ్డారు. అప్పులుచేసి సంక్షేమపథకాలు అమలుచేయటంపై అభ్యంతరం వ్యక్తంచేశారు. అప్పులుచేసి సంక్షేమపథకాలను అమలుచేయటం వల్ల ఏపీ కూడా తొందరలోనే మరో శ్రీలంకలాగ అయిపోతుందని తెగ బాధపడిపోయారు.





సో పవన్ వరసచూస్తుంటే జనసేన అధికారంలోకి రాగానే ఇపుడు అమలవుతున్న సంక్షేమపథకాలన్నీ ఆగిపోవటం ఖాయంగానే అనిపిస్తోంది. కాకపోతే జగన్ అమలుచేస్తున్న సంక్షేమపథకాలను ఆపేస్తానని పవన్ డైరెక్టుగా ఎక్కడా చెప్పలేదు. ఇదే సమయంలో సంక్షేమపథకాల అమలుపైన అభ్యంతరాలు వ్యక్తంచేస్తున్నారు. అప్పులుచేసి సంక్షేమపథకాలు అమలుచేయటం ఏమిటి అనే పవన్ అభ్యంతరమే అర్ధంలేనిది.






ఎందుకంటే 2014లో రాష్ట్రం ఏర్పాటవ్వటమే లోటుబడ్జెట్ తో ఏర్పాటైంది. దానిమీద సుమారు రు. 90 వేల కోట్ల అప్పుంది. దీనికి అదనంగా చంద్రబాబునాయుడు హయాంలో మరో రు. 3 లక్షల కోట్లు అప్పుచేశారు. అంటే జగన్ అధికారంలోకి వచ్చేనాటికే రాష్ట్రం పీకల్లోతు అప్పుల్లో ఉందన్నది వాస్తవం. తాను తీసుకొచ్చిన అప్పులు దేనికి ఖర్చుపెట్టామో లెక్కలు చెబుతామని ఆర్ధికశాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాధరెడ్డి అన్నారు. అలాగే చంద్రబాబు హయాంలో చేసిన లక్షల కోట్లరూపాయలు దేనికి ఖర్చుపెట్టారో లెక్కలు చెప్పగలరా అని చాలెంజ్ చేస్తే దానికి టీడీపీ నుండి సమాధానంలేదు.






అంటే రాష్ట్రానికి సొంత ఆదాయం వస్తున్నా సరిపోవటంలేదు. అందుకనే సంక్షేమపథకాల అమలుకు కొంత అప్పులుచేస్తున్నారు. నిజానికి అప్పుచేసి పప్పుకూడా ఎప్పటికీ మంచిదికాదు. కానీ సంక్షేమపథకాలు అమలుచేయటమన్నది జగన్తోనే మొదలుకాలేదు. సో రేపు పవన్ అధికారంలోకి వచ్చినా సంక్షేమపథకాలు అమలవ్వాలంటే అప్పులు చేయాల్సిందే. లేకపోతే పూర్తిగా నిలిపేయాలంతే. అందుకనే పవన్ రెండో మార్గాన్ని డిసైడ్ చేసినట్లున్నారు. జనసేన అధికారంలోకి వస్తే సంక్షేమపథకాలు నిలిపేస్తామని గనుక ప్రకటిస్తే పవన్ను ధైర్యవంతుడనే చెప్పాలి. మరి పవన్ ఆపనిచేయగలరా ?  


 




మరింత సమాచారం తెలుసుకోండి: