రాబోయే ఎన్నికలలో భాగంగా గెలిచేందుకు అన్ని రాజకీయ పార్టీలు ఎవరికీ తగిన ప్రణాళికలు మరియు వ్యూహాలతో వారు చాలా బిజీగా ఉన్నారు. కేంద్ర స్థాయిలో చూసినట్లయితే అధికారంలో ఉన్న బీజేపీ అన్ని పార్టీల కన్నా కొంచెం ముందస్తుగా ప్రణాళికలతో జోరు మీద ఉంది అని చెప్పాలి. రాష్ట్రాల వారీగా ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయడానికి తగిన అవసరమయిన గ్రౌండ్ వర్క్ ను చేసుకుంటూ పోతోంది. అయితే ఇదంతా కూడా 2024 లో జరగబోయే ఎన్నికల విజయం కోసమే అని తెలిసిందే. అందులో భాగంగానే నిన్న వేసిన ఒక స్టెప్ దేశ వ్యాప్తంగా రాజకీయ ప్రముఖులను నిదురలేకుండా చేస్తోంది. కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీని బీజేపీ పార్లమెంటరీ బోర్డు నుండి తొలగించడమే ఇందుకు కారణం.

అయితే ఈయనకు ఉన్న అపారమైన అనుభవాన్ని దృష్టిలో ఉంచుకుని కూడా తొలగించడం అంటే మాములు విషయం కాదు. ఈ విషయంలో ముందుగానే అన్ని విషయాలు ఆయనకు వివరించిన పిమ్మట ఈ నిర్ణయం తీస్కుని ఉంటారన్నది ప్రముఖుల అభిప్రాయం. ఈయన బీజేపీ జాతీయ అధ్యక్షుడిగా కూడా పనిచేశారు. మహారాష్ట్ర నుండి అంచెలంచెలుగా ఎదిగి నేడు కేంద్ర మంత్రిగా ఉన్నారు. అయితే గడ్కరీ కొంతకాలంగా పరిశీలిస్తే పార్టీ పనులలో అంత చురుకుగా పాల్గొనడం లేదన్నది కాదనలేని వాస్తవం. అయితే ఎందుకు గడ్కరీపై మోదీ ఇంత పగబట్టారు అన్న విషయం అంతుబట్టడం లేదు. విశ్వసనీయ వర్గాల ప్రకారం తెలుస్తున్న సమాచారాన్ని బట్టి త్వరలోనే ఈయనను కేంద్రమంత్రి గా కూడా వేటు వేయచ్చని అంటున్నారు.

అయితే ఇదంతా కూడా నాయకత్వ లేమి లేకుండా ప్రత్యామ్నాయ నాయకులను తయారుచేయడమే ఆర్ ఎస్ ఎస్ లక్ష్యంగా తెలుస్తోంది. అందుకే మహారాష్ట్రకు చెందిన డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ను బీజేపీ పార్లమెంటరీ బోర్డు లోకి తీసుకోవడం జరిగింది. కాగా వ్యక్తిగతంగా ఎంత నష్టం జరిగినా నాయకులు ఎవరూ కూడా  పార్టీ , సంఘం సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటారన్నది తెలిసిన విషయమే.


మరింత సమాచారం తెలుసుకోండి: