ఇక తెలంగాణ డిస్కంల నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలు చెల్లించేలా ఆ రాష్ట్ర సర్కార్ కు ఆదేశాలివ్వాలని ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.ఈ మేరకు సోమవారం నాడు ప్రధాని నరేంద్ర మోడీ, కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ను కలిసి విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ప్రధాని మోడీతో అరగంటపాటు భేటీ అయిన సీఎం జగన్.. ఏపీకి చెందిన పలు అంశాలతోపాటు తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఇక దాదాపు రూ.6,756 కోట్ల బకాయిలు ఉన్నాయని ఇంకా 8 ఏండ్లుగా ఈ సమస్య పరిష్కారం కావడం లేదని వివరించారు. ఈ మొత్తం ఇప్పిస్తే కష్టాల్లో ఉన్న రాష్ట్ర విద్యుత్‌ కంపెనీలు ఒడ్డున పడతాయని, అలాగే ఉత్పత్తిదారులకు బకాయిలు చెల్లించే వీలు కలుగుతుందని చెప్పారు.ఇంకా అలాగే, విభజన సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కూడా సీఎం జగన్ విజ్ఞప్తి చేశారు. విభజన వల్ల రాష్ట్రం చాలా తీవ్రంగా నష్టపోయిందని, పార్లమెంటు సాక్షిగా ఇచ్చిన హామీలు కూడా అమలు చేయాలని కోరారు.


ఏపీకి స్పెషల్ స్టేటస్ ఇవ్వాలని కూడా విజ్ఞప్తి చేశారు. అనంతరం మధ్యాహ్నం 12:30కు రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిసి శుభాకాంక్షలు కూడా తెలిపారు. మధ్యాహ్నం 1:30కు కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ ను కూడా కలిశారు. ఆయనతో కూడా తెలంగాణ చెల్లించాల్సిన విద్యుత్ బకాయిలపై చర్చించారు.ఇక తెలంగాణ సర్కారు దాదాపు రూ.6 వేల కోట్లు ఏపీకి విద్యుత్ బకాయిలు చెల్లించాల్సి ఉందని కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి ఆర్కే సింగ్ వెల్లడించారు. జగన్ మోహన్ రెడ్డితో భేటీ తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. బకాయిల విషయం సొలిసిటర్ జనరల్ వద్ద ఉందని, ఇంకా త్వరలోనే దీనిపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.అలాగే చట్టం ప్రకారమే బకాయిల అంశాన్ని పరిష్కరిస్తామన్నారు. పవర్ ఎక్స్చేంజీలలో కొనుగోళ్లు ఇంకా బకాయిలపై సమాచారంలో ఎంటువంటి పొరపాట్లు జరగలేదన్నారు. ఇంకా విద్యుత్ కొనకుండా ఏ రాష్ట్రంపై కూడా నిషేధం విధించలేదని చెప్పారు.

మరింత సమాచారం తెలుసుకోండి: