మూడురోజుల నుండి ఒక స్టోరీని ఎల్లోమీడియా బాగా వైరల్ చేస్తోంది. తాను వైరల్ చేయటమే కాకుండా తెలుగుదేశంపార్టీకి సంబంధించిన సోషల్ మీడియా ద్వారా పదే పదే ప్రచారం చేయిస్తోంది. ఇంతకీ విషయం ఏమిటంటే ఈమధ్యనే కేంద్రహోంశాఖ మంత్రి అమిత్ షా తో నారా లోకేష్ భేటీ అయ్యారట. నరేంద్రమోడీతో చంద్రబాబు కలిసిన సమయంలోనే అమిత్-లోకేష్ భేటీ కూడా జరిగిందన్నది దాని సారాంశం. ఇంతకీ ఆ భేటీ ఏమిటంటే టాప్ సీక్రేట్ గా జరిగిందట.




మరంతటి టాప్ సీక్రెట్ సమావేశం ఎక్కడ జరిగిందో ? ఎవరు ఏర్పాటుచేశారో కూడా తెలీదు. కానీ అదిగో పులంటే ఇదుగో తోకన్నట్లుగా ఎల్లోమీడియా తెగ ప్రచారం చేసేస్తోంది. ఇంతకీ ఎందుకింతగా ప్రచారం చేస్తోందంటే అమిత్-జూనియర్ ఎన్టీయార్ భేటీని చంద్రబాబు అండ్ కో తో పాటు ఎల్లోమీడియా తట్టుకోలేకపోతున్నారు. ఎంతకాలం అపాయిట్మెంట్ అడిగినా ఇవ్వని అమిత్ షా తనంతట తానుగా కోరిమరీ జూనియర్ ను డిన్నర్ ఆహ్వానించటమంటే మండదామరి.





అందుకనే జూనియర్ కన్నా లోకేష్ ఎందులోను తక్కువకాదని అటుఇటుగా ఇంకా ఎక్కువేనని చెప్పటానికి ఎల్లోమీడియా నానా అవస్తలుపడుతోంది. ఆ ముక్కేదో లోకేష్ డైరెక్టుగా చెబితే అందరు నవ్వుతారని ఢిల్లీలోని ఒక మీడియా అమిత్-లోకేష్ భేటీని బయటపెట్టినట్లు అదేదో తమకే ముందు తెలిసినట్లుగా ఇక్కడ ఎల్లోమీడియా నానా గోలచేస్తోంది. మరి తన ప్రచారంలో అమిత్ షా స్ధాయిని ఎల్లోమీడియా బాగా నేలబారుకు తగ్గించేసినట్లుంది. లేకపోతే చంద్రబాబుకే అపాయిట్మెంట్ ఇవ్వని కేంద్రహోంశాఖమంత్రి లోకేష్ తో భేటీ అయ్యారంటే అది అమిత్ షా స్ధాయిని తగ్గించటం కాక మరేమిటి ?





పైగా వీళ్ళభేటీ రహస్యంగా జరిగిందట. లోకేష్ తో అంత రహస్యంగా భేటీ అవ్వాల్సిన అవసరం అమిత్ షా కు ఏమొచ్చింది ? అంటే తమ భేటీసంగతి మోడీకి కూడా తెలియనంతగా దాచిపెట్టాలని అమిత్ షా అనుకుంటున్నారా ? ఇక్కడ విషయం ఏమిటంటే తమ అవసరాలకోసం, తమ ప్రయోజనాలకోసం టీడీపీ+ఎల్లోమీడియా ఎవరైనా ఇలాగే వాడేసుకుంటుంది. ఇపుడు జూనియర్ కు పోటీగా లోకేష్ ను జాకీలేసి పైకి లేపుతోందంతే.






మరింత సమాచారం తెలుసుకోండి: