ఆంధ్రప్రదేశ్ అప్పుల్లో ఉందని జగన్ అప్పులు తెచ్చి డబ్బులు ఇస్తున్నాడు అని అందుకే పెద్ద ఎత్తున రేట్లు ఏపీలో పెరుగుతున్నాయని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు బాదుడే బాదుడు కార్యక్రమం డిజైన్ చేశారు. దీన్నే జనాలలో పెట్టమన్నారు. అయితే ఈ కార్యక్రమంలో మొదట్లో ఉత్సాహంగా పాల్గొన్న పార్టీ జనాలు కూడా ఆ తరువాత మెల్లగా సైడ్ అవుతున్నారు. ఇక దానికి కారణం వారిది బాదుడు సమస్య కాదు టికెట్ల సమస్య.ముందు మాకు ఎక్కడ సీటు ఇస్తున్నారో చెప్పమని చంద్రబాబు నాయుడుని లోకేష్ ని అడుగుతున్నారు. ఇపుడున్న పరిస్థితులలో తాము ఖర్చు పెట్టుకుని జనాల్లో తిరిగినా కేసులు పెట్టించుకుని అరెస్టులు అయినా టికెట్ కి ఠికాణా లేకపోతే అంతా వేస్ట్ కదా అన్న బాధ తమ్ముళ్ళది. అందుకే ముందు టికెట్ల సంగతి తేల్చమని వారు అంటున్నారుట.ఇప్పుడు పెద్ద ఎత్తున డబ్బులు తీసి ఖర్చు చేస్తాం జనాల్లోకి వెళ్తాం కానీ రేపటి రోజున పొత్తులలో భాగంగా తమ సీట్లు పోతే అవి ఏ బీజేపీకో జనసేనకు వెళ్తే మా పరిస్థితి ఏమిటి అని అడుగుతున్నారు. అందుకే టీడీపీలో పెద్ద ఎత్తున నాయకులు ఉన్నారు.


అలాగే ఇంచార్జిలు ఉన్నా కూడా ఎవరూ జనంలోకి రావడంలేదు అని అంటున్నారు.అయితే వారి వాదనలో కూడా నిజం ఉంది కదా. పార్టీ అంటేనే ఖర్చు చేయాలి. ఇక రాజకీయం అంటే ముందూ వెనకా చూసుకోవాల్సిన పని లేదు. కానీ కనీసం అయినా గ్యారంటీ ఉంటే వారు పులులు మాదిరిగా ముందుకు దూకుతారు. మీరే పోటీకి దిగుతారు. ఇక మీ ఇష్టం అంటే వారు ఆకాశమే హద్దుగా చెలరేగిపోతారు. కానీ చంద్రబాబు ఇంకా ట్రెడిషనల్ పాలిటిక్స్ చేస్తూ చివరి నిముషం వరకూ తెమల్చరు అన్న పేరుంది.మరి అలా డబ్బు ఖర్చు పెట్టుకుని టికెట్ దక్కపోతే తమ గతేం కాను అని ఆలోచిస్తున్న వారికి భరోసా ఇచ్చి ముందుకు నడిపించాల్సింది పార్టీ నాయకత్వమే. అలాగే జనాలలో ఉండేలా మంచి కంటెంట్ తో ఉద్యమాలు చేయాలి. ఆ విధంగా జనం మూడ్ ని ఎప్పటికపుడు గమనించాలి. కానీ టీడీపీ స్కూల్ చూస్తే ఇంకా అప్ టో డేట్ కావాల్సి ఉందనే అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: