ఒకేసారి ఇటు చంద్రబాబునాయుడు అటు పవన్ కల్యాణ్ గాలి తీసేసింది బీజేపీ. దీపావళిలోపు ఎన్డీయేలో టీడీపీ చేరబోతోందంటు ఎల్లోమీడియా ఒకటే ఊదరగొడుతోంది. కుటుంబపార్టీలతో బీజేపీ పొత్తు పెట్టుకోదని బీజేపీ నేతలు ఎంతచెబుతున్నా టీడీపీ+ఎల్లోమీడియా వినిపించుకోవటంలేదు. ఎలాగైనా సరే వచ్చే ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకోవాల్సిందే అని చంద్రబాబు డిసైడ్ అయినట్లున్నారు. అందుకనే బీజేపీ వద్దుపొమ్ముంటున్నా కాదుకాదని పదే పదే టీడీపీ-బీజేపీ పొత్తు ఖాయమైపోయిందంటు వార్తలు రాయించుకుంటున్నారు.






ఢిల్లీలో న్యూ ఇండియన్ ఎక్స్ ప్రెస్ లో పొత్తువార్తలు వచ్చాయని, రిపబ్లిక్ టీవీలో పొత్తు కథనం వచ్చిందని చెప్పి ఎల్లోమీడియా ఏపీలో తెగ హడావుడి చేసేస్తోంది. ఇందుకనే వైసీపీ నేతలు మాట్లాడుతు ఈ వార్తలు, కథనాలన్నింటినీ చంద్రబాబే రాయించుకుంటున్నారంటు ఎద్దేవా చేస్తున్నారు. సరిగ్గా ఈ నేపధ్యంలోనే టీడీపీతో బీజేపీ ఎలాంటి పొత్తు పెట్టుకోవటంలేదని బీజేపీ పార్లమెంటరీపార్టీ సభ్యుడు డాక్టర్ లక్ష్మణ్ స్పష్టంగా ప్రకటించారు.






తమ రెండుపార్టీల మధ్య పొత్తుంటుందని వార్తలరూపంలో జరుగుతున్న ప్రచారమంతా అబద్ధమని కొట్టిపడేశారు. టీడీపీతో పొత్తుపెట్టుకునే ఆలోచనే తమకు లేదని కూడా చెప్పేశారు. వచ్చే తెలంగాణా ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగానే పోటీచేస్తుందని కూడా లక్ష్మణ్ ప్రకటించారు. అంటే కమ్మోరి ఓట్లకోసం తెలంగాణాలో రెండుపార్టీలు పొత్తుపెట్టుకుంటాయని జరుగుతున్న ప్రచారమంతా ఉత్తుత్తిదే అని తేలిపోయింది. మరి బీజేపీతో పొత్తు విషయంలో టీడీపీ, ఎల్లోమీడియా ఎలాంటి కొత్త కథనాలను తెరపైకి తెస్తాయో చూడాల్సిందే.






ఇదే సమయంలో తెలంగాణా ఎన్నికల్లో జనసేనతో కూడా బీజేపీకి పొత్తుండదని లక్ష్మణ్ చెప్పేశారు. అంటే తెలంగాణాలో పవన్ కు అంత సీన్ లేదని బీజేపీ నేతలు భావిస్తున్నట్లున్నారు. జనసేనతో పొత్తు ఏపీకి మాత్రమే పరిమితమని తెలంగాణాలో అవసరంలేదని చెప్పేశారు. గ్రేటర్ ఎన్నికల్లో కూడా పార్టీ చీఫ్ బండి సంజయ్ మాట్లాడుతు జనసేనతో బీజేపీ పొత్తు పెట్టుకుంటుందని ఎలాగ అనుకున్నారంటు మీడియానే ఎదురు ప్రశ్నించిన విషయం గుర్తుండే ఉంటుంది. చంద్రబాబుతో పూర్తిగాను  పవన్ తో తెలంగాణాలో పొత్తుండని లక్ష్మణ్ స్పష్టంగా చెప్పేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: