చంద్రబాబునాయుడులో ఫ్రస్ట్రేషన్ పీక్స్ కు చేరుకుంటున్నట్లే ఉంది. తాజాగా పార్టీ నేతలను ఉద్దేశించి ఆయన మాట్లాడిన మాటలే దీనికి నిదర్శనం. నేతలతో చంద్రబాబు మాట్లాడుతు టీవీ9, ఎన్టీవీ ఛానళ్ళను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. సరే ఆయన పార్టీ ఆయనిష్టం అనుకుందాం. బహిష్కరించటానికి చంద్రబాబు చెప్పిన కారణాలే విచిత్రంగా ఉంది. ప్రతిపక్షమైన టీడీపీని పై రెండు ఛానళ్ళు టార్గెట్ చేస్తున్నాయట. దేశంలో ప్రతిపక్షాలను టార్గెట్ చేసిన మీడియా ఎక్కడా లేదట.






ప్రతిపక్షాన్ని విమర్శించే మీడియాను తన జీవితంలో తానింతవరకు చూడలేదట. అందుకనే ఈ రెండు ఛానళ్ళను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు. ఇక్కడే చంద్రబాబులోని ఫ్రస్ట్రేషన్ ఏ స్ధాయికి చేరుకుందో అర్ధమైపోతోంది. చంద్రబాబు అధికారంలో ఉండగా మొత్తం ఎల్లోమీడియా మొత్తం జగన్మోహన్ రెడ్డినే టార్గెట్ చేసిన సంగతి దేశమంతా చూసింది. చంద్రబాబు ప్రయోజనాలను రక్షించటమే ధ్యేయంగా ఎల్లోమీడియా ఆరోజే కాదు ఈరోజు  కూడా జగన్ను వెంటాడుతోంది.





ఇపుడు చంద్రబాబు బహిష్కరించిన ఛానళ్ళల్లో టీవీ9 కూడా అప్పట్లో చంద్రబాబుకు బాకాలూదిందే. కాకపోతే తర్వాత యాజమాన్యం మారటంతోనే దాని స్టాండ్ మారిందంతే. ఇపుడు కూడా వైసీపీకి వ్యతిరేకంగానే చర్చలు, కథనాలుంటాయి. కాకపోతే అప్పుడంత కాదని చెప్పాలి. ఇక ఎన్టీవీలో జగన్ కు మద్దతుగా ఏమీ నూరుశాతం కథనాలు, వార్తలు రావు. ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ వైసీపీకి వ్యతిరేకంగానే వార్తలు, కథనాలు వస్తునే ఉంటాయి. కాకపోతే చంద్రబాబు బాధేమిటంటే ఈ రెండు ఛానళ్ళు నూరుశాతం ఎల్లోమీడియాలాగే తనకు మాత్రమే బాకాలూదటం లేదని.






ఒకపుడు రాజకీయంగా ఎవరి మధ్య ఎన్ని సమస్యలున్నా మీడియా జోలికొచ్చేవారు కాదు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ కు  కూడా ఎల్లోమీడియా వ్యతిరేకమైనా జర్నలిస్టులను వైఎస్ ఎప్పుడూ తప్పుపట్టలేదు. ఒక మీడియాను బహిష్కరించటమన్నది చంద్రబాబుతోనే మొదలైంది. 2008లో సాక్షిమీడియాను తన ప్రెస్ మీట్లకు, ఎన్టీయార్ భవన్ కు రాకుండా చంద్రబాబు బహిష్కరించారు. తర్వాత ఆంధ్రజ్యోతి, ఏబీఎన్ ఛానల్ ను జగన్ బహిష్కరించారు. తాజాగా చంద్రబాబు తన బహిష్కరణను విస్తృతం చేశారంతే.


 

మరింత సమాచారం తెలుసుకోండి: