ఆంధ్రప్రదేశ్ లో వైసీపీ పాలనలో ఫిఫ్టీ ఫిఫ్టీ అన్నట్లు పాలన పట్ల ఫీడ్ బ్యాక్ వినిపిస్తోంది. కానీ ఎప్పటిలాగే వైసీపీ నాయకత్వం మాత్రం అంతా బాగానే చేస్తున్నాము అంటూ చెప్పుకుంటోంది. ఇదిలా ఉంటే వచ్చే ఎన్నికల కోసం రాష్ట్రంలోని అన్ని రాజకీయ పార్టీలు సమాయత్తం అవుతున్నాయి. అయితే జగన్ నాయకత్వం లోని వైసీపీ ఈసారి కూడా ఎన్నికలలో గెలిచి అధికారాన్ని నిలబెట్టుకోవాలని ప్రయత్నాలు చేస్తోంది. కానీ జగన్ కోరిక నెరవేరడం అంటే అంత ఈజీ కాదని తెలుస్తోంది. కొన్ని జిల్లాల్లో పార్టీ పరిస్థితి బాగాలేదు అని సర్వేలు ప్రకారం తెలుస్తోంది.

అటువంటి ఇబ్బందికర జిల్లాలలో ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం కూడా ఒకటి. ఈ జిల్లాలో మొత్తం 10 ఎమ్మెల్యే నియోజకవర్గాలు ఉన్నాయి. అందులో గత ఎన్నికల్లో 8 సీట్లు గెలుచుకుని సత్తా చాటింది వైసీపీ. కానీ ఈ సారి పరిస్థితి అలా లేదు. దీనికి కారణం ఆ జిల్లాలో ఉన్న సీనియర్ నేతలు యాక్టీవ్ గా లేకపోవడమే అని తెలుస్తోంది. ధర్మాన బ్రదర్స్ ఈ జిల్లాలో వైసీపీకి కీలకం అని తెల్సిందే. ధర్మాన కృష్ణ దాస్ ప్రస్తుతం జిల్లా అధ్యక్షుడు గా ఉన్నారు మరియు ధర్మాన ప్రసాదరావు రెవెన్యూ శాఖా మంత్రిగా ఉన్నారు.

కాగా వీరిద్దరూ జిల్లాలో అంత దూకుడుగా లేరన్నది సర్వే ప్రకారం వినిపిస్తున్న మాట. అందులోనూ ఈ జిల్లాలో అచ్చన్నాయుడు మరియు రామ్మోహన్ నాయుడు ప్రభావవంతంగా ఉండడం వలన ప్రతిపక్ష టీడీపీ బలపడుతూ వస్తోంది. కాగా ఇప్పటికిప్పుడు కనుక ఎన్నికలు జరిగితే మాత్రం వైసీపీకి రెండు సీట్లు దక్కుతాయని తెలుస్తోంది. ఈ విషయం పట్ల వైసీపీ హై కమాండ్ అసంతృప్తిగా ఉన్నారట. మరి ఇక ఉన్న కొద్దీ కాలంలో ధర్మాన బ్రదర్స్ తమ జోరు చూపించి వైసీపీ కి గతంలో కన్నా మించిన ఫలితాన్ని అందిస్తారా చూడాలి.  


మరింత సమాచారం తెలుసుకోండి: