ఇండియన్ రైల్వేస్:  ఇండియన్ రైల్వేస్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇండియన్ రైల్వేస్ తన సర్వీసులను మెరుగు పరుచుకునేందుకు ఎప్పటికప్పడు ప్రయత్నిస్తూనే ఉంది.తన ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించాలని నిత్యం భావిస్తోంది. అందుకే ఎప్పటిప్పుడు పరిస్థితులకు అనుగుణంగా కొత్త సేవలు అందుబాటులోకి తెస్తూ ఉంటుంది.ట్రైన్ జర్నీ చేసే వారు ముఖ్యంగా ఒక విషయం తెలుసుకోవాలి. రైలు ఆలస్యం అయితే అప్పుడు మీకు ఉచితంగా ఫుడ్ లభిస్తుంది. రైల్వేస్ ప్రయాణికులకు ఈ సౌకర్యం కల్పిస్తోంది. అంటే ట్రైన్ లేట్ అయితే రైల్వేస్ నుంచి మీకు ఉచితంగా ఫుడ్ లభిస్తుంది.అయితే ఇక్కడ ఒక విషయాన్ని గుర్తించుకోవాలి. అన్ని ట్రైన్స్‌లో ఈ ఫెసిలిటీ అందుబాటులో లేదు. కేవలం కొన్ని రైళ్లకు మాత్రమే ఇది వర్తిస్తుంది. అందులోనూ ప్రీమియం ట్రైన్స్‌లో ఈ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి. రాజధాని, శతాబ్ది, డ్యురొంటొ వంటి ట్రైన్స్‌ను ఇక్కడ ఉదాహరణగా చెప్పుకోవచ్చు.రైల్వేస్ ట్రైన్ కార్యకలాపాల మీద ప్రత్యేకమైన శ్రద్ద ఉంచింది. 


అందుకే ఈ రకంగా సర్వీసులు అందుబాటులో ఉంచుతోంది. విమనయాన కంపెనీలు కూడా ఫ్లైట్ ఆలస్యం అయితే ప్రయాణికులకు ఉచిత మీల్స్ సదుపాయం కల్పిస్తాయి. ఇలానే ట్రైన్స్‌లో కూడా ఉచిత ఫుడ్ లభిస్తుంది.రైల్వే రూల్స్ ప్రకారం చూస్తే.. ప్రీమియం ట్రైన్ స్టేషన్‌కు 2 గంటలకు పైగా ఆలస్యంగా వస్తే.. ప్రయాణికులకు ఉచితంగా ఫుడ్ లభిస్తుంది. అందువల్ల ఈ ఫెసిలిటీ కేవలం ప్రీమియం ట్రైన్లకు మాత్ర ఉంటుందని గుర్తించుకోవాలి. ప్రీమియం ట్రైన్స్‌లో టికెట్ ధర సాధారణ రైళ్లు, ఎక్స్‌ప్రెస్ ట్రైన్స్ కన్నా ఎక్కువగా ఉంటుంది.మరోవైపు ఐఆర్‌సీటీసీ సెప్టెంబర్ 12న దాదాపు 277 ట్రైన్స్‌ను క్యాన్సిల్ చేసింది. ఆపరేషనల్ అండ్ మెయింటెనెన్స్ వర్క్ కారణంగా ఈ నిర్ణయం తీసుకోవాల్సి వచ్చిందని ఐఆర్‌సీటీసీ తెలిపింది. వీటిల్లో 201 ట్రైన్స్ పూర్తిగా రద్దు అయ్యాయి. అలాగే మిగిలిన 76 ట్రైన్స్ పాక్షికంగా రద్దయ్యాయని ఐఆర్‌సీటీసీ పేర్కొంది.

మరింత సమాచారం తెలుసుకోండి: