గతంలో వైఎస్సార్ చనిపోకముందు ఉమ్మడి రాష్ట్రంగా మరియు కాంగ్రెస్ పార్టీ సస్యశ్యామలంగా ఉన్న విషయం తెలిసిందే. అదే సమయంలో స్వర్గీయ ఎన్టీఆర్ కుమార్తె దగ్గుబాటి పురంధేశ్వరి వైఎస్ పలుకుబడితో కాంగ్రెస్ లో చేరి విశాఖపట్టణం ఎంపీగా గెలవడం మరియు కేంద్రంలో మంత్రిగా పదవిని పొంది రాజ్యమేలారు. కట్ చేస్తే... వైఎస్సార్ చనిపోయాక మొత్తం అడ్డం తిరిగింది. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయింది, కాంగ్రెస్ కు అడ్రస్ లేకుండా పోయింది. దీనితో అక్కడ భవిష్యత్తు లేదని గ్రహించిన చాలా మంది నాయకులు వైసీపీ, బీజేపీ మరియు టీడీపీ లు అంటూ చూసుకుని మారిపోయారు. ఇక పురందేశ్వరి కూడా బీజేపీ లాంటి జాతీయ పార్టీలోకి చేరిపోయారు.

ఇప్పటి వరకు రెండు దపాలు ఎన్నికలు జరుగగా రెండు సార్లు కూడా ఆమె విజయాన్ని సాధించలేకపోయారు. దీనికి కారణం ఆమెకు తన లక్కీ అయిన వైజాగ్ లో సీటు ఇవ్వకపోవడమే. కానీ బీజేపీ లో ఉన్నా కూడా చాలా కాలం తర్వాత ఆమెను అధిష్టానం గుర్తించి కొన్ని బాధ్యతలను అప్పగించింది. అందులో ఒరిస్సా మరియు ఛత్తీస్గఢ్ రాష్ట్రాలకు పరిశీలక ఇంచార్జి గా మరియు ఇతర పార్టీల నుండి బీజేపీలో చేరే కమిటీలో సభ్యురాలుగా కూడా నియమించారు. అయితే వీటిలో తన పనితనం చూపిస్తే ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళ్లే అవకాశం లేకపోలేదు. కానీ కారణాలు ఏమన్నది తెలియదు... ఇటీవల ఒరిస్సా ఛత్తీస్గఢ్ పదవి నుండి తప్పించారు. దీనితో కొంచెం ఫీల్ అయిన పురంధేశ్వరి మీడియా ముందుకు రావడానికి ఇబ్బంది పడ్డారు.

అయితే తనకు ఇక రాబోయే ఎన్నికలు చాలా కీలకం కానున్నాయి. ఈ ఎన్నికలలో కనుక గెలవకపోతే తనకు పార్టీలో గౌరవం ఉండదు... కేంద్రమంత్రిగా చేసిన నాయకురాలు వరుసగా మూడు సార్లు ఓడిపోతే చాలా అగౌరవం. కాబట్టి ఎలాగైనా గెలిచి కేంద్రమంత్రి పదవిని దక్కించుకోవాలని ప్రయత్నాలు జరుగుతున్నాయి. అందుకోసం వైజాగ్ సీట్ ను ఎలాగైనా దక్కించుకుని గెలవాలని తాపత్రయం పడుతోంది. మరి తన భవిష్యత్తు ఎలా ఉండనుందో తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే. ఒక విధంగా చెప్పాలంటే పురందేశ్వరి రాజకీయ కెరీర్ ప్రమాదంలో ఉన్నట్టే.  

మరింత సమాచారం తెలుసుకోండి: