రాజమౌళిని భారీ సినిమాల దర్శకుడుగా మార్చిన అవకాశం అల్లు అరవింద్ ‘మగధీర’ సినిమాతో ఆసినిమా తరువాత రాజమౌళి తాను తీసే ప్రతి సినిమాతోను ఎదిగి ప్రస్తుతం ఇండియాలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన దర్శకుడుగా మారాడు. హాలీవుడ్ దర్శకులు కూడ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ టేకింగ్ ను ప్రశంసిస్తూ కామెంట్స్ చేస్తున్నారు అంటే ప్రస్తుతం రాజమౌళి మ్యానియా ప్రపంచ వ్యాప్తంగా ఏస్థాయిలో ఉందో అర్థం అవుతుంది.


ఇండస్ట్రీలో హడావిడి చేస్తున్న వార్తల ప్రకారం అల్లు అరవింద్ ‘అల్లు ఎంటర్ టైన్ మెంట్’ పేరు మీద డిస్నీ హాట్ స్టార్ కు మహాభారతం వెబ్ సిరీస్ చేయడానికి ఒక అంగీకారానికి వచ్చినట్లు తెలుస్తోంది. భారీ స్థాయిలో నిర్మించబోయే ఈ వెబ్ సిరీస్ నిర్మాణ బాధ్యతల నిర్వహణలో రాజమౌళిని కూడ భాగస్వామిగ తనతో కలవమని అల్లు అరవింద్ రాజమౌళిని కోరినట్లు వార్తలు వస్తున్నాయి.


వాస్తవానికి మహాభారతం మూవీని 5 భాగాలుగా తీయాలని రాజమౌళి కోరిక. అయితే ఆమూవీ ఎప్పుడు చేస్తానో తనకు తెలియదని తాను ఇండస్ట్రీ నుండి రిటైర్ అయ్యే లోపు మాత్రం ఖచ్చితంగా తీస్తానని రాజమౌళి చెపుతున్నాడు. జక్కన్న ఒక సినిమాను తీయాలి అంటే కనీసం రెండు సంవత్సరాల సమయాన్ని తీసుకుంటాడు. దీనితో రాజమౌళి మహాభారతం తీయాలి అంటే కనీసం ఒక పుష్కరకాలం పట్టే ఆస్కారం ఉంది. ఈమూవీ ప్రాజెక్ట్ కేవలం ఆలోచనలకే పరిమితం అవుతుందా అన్న సందేహాలు కూడ ఉన్నాయి.


ఇలాంటి పరిస్థితులలో అల్లు అరవింద్ నుండి వచ్చిన ఆహ్వానాన్ని జక్కన్న మన్నిస్తాడా లేదంటే తాను భావిస్తున్నట్లుగా తన కెరియర్ చివరి దశలో మహాబారతం 5 భాగాలుగా తీస్తాడా అన్న సందేహాలు చాలామందికి ఉన్నాయి. అరవింద్ ఆహ్వానాన్ని మన్నించి డిస్నీ హాట్ స్టార్ కు మహాభారతాన్ని నిర్మించే విషయంలో జక్కన్న చేయి కలిపితే అది ఒక సంచలనం. ఈవిషయమై త్వరలో రాజమౌళి ఒక నిర్ణయం తీసుకునే ఆస్కారం ఉంది అని అంటున్నారు..




మరింత సమాచారం తెలుసుకోండి: