జనసేన అధినేత పవన్ కల్యాణ్ అంచనాలు దారుణంగా తప్పిపోయాయి. అక్టోబర్ 5వ తేదీ విజయదశమి రోజునుండి బస్సుయాత్రను ప్లాన్ చేసుకున్నారు. ఇదే విషయాన్ని పదే పదే పవన్ ప్రకటించారు. తన యాత్ర 26 జిల్లాల్లోను సాగేట్లుగా ఏ ఏ నియోజకవర్గాల్లో యాత్ర జరగాలో కూడా జనసేన డిసైడ్ చేసింది. యాత్రలో ఎవరెవరు పాల్గొనాలి ? ఎక్కడెక్కడ పవన్ బసచేయాలి ? బసచేసే సమయంలో ఎవరెవరితో భేటీలు జరపాలనే విషయన్ని కూడా జనసేన నేతలు డిసైడ్ చేసేశారు.





యాత్రలో భాగంగానే బస్సును అన్నీ ఆధునిక సౌకర్యాలతో రెడీచేస్తున్నారు. బస్సును అనుసరించాల్సిన వ్యక్తిగత సిబ్బంది కోసం ప్రత్యేకంగా ఎనిమిది వాహనాలను కూడా కొన్నారు. అంతా చకచకా జరుగుతున్న సమయంలో హఠాత్తుగా యాత్రను వాయిదా వేసుకున్నట్లు సమాచారం. యాత్రను ఎందుకు వాయిదావేసుకున్నారు ? ఎందుకంటే ముందస్తు ఎన్నికలు వచ్చేయటం ఖాయమని పవన్ అంచనా వేశారు. ఈ అంచనా వేయటానికి కారణం ఏమిటంటే చంద్రబాబునాయుడు, ఎల్లోమీడియా కథనాలే.





ముందస్తు ఎన్నికలు ఖాయమని, జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటం ఖాయమంటు చంద్రబాబు, ఎల్లోమీడియా ఒకటే ఊదరగొట్టారు. దాంతో అదే నిజమనుకుని పవన్ కూడా ముందస్తు ఎన్నికలకు రెడీ అవటంలో భాగంగా బస్సుయాత్ర ప్లాన్ చేసుకున్నారు. ఆరుమాసాల పాటు జనాల్లోనే ఉండేట్లుగా బస్సుయాత్రను డిజైన్ చేశారు. బస్సుయాత్ర చేయటం, ఈ సమయంలో అభ్యర్ధులను ఫైనల్ చేసేయటం, యాత్ర పూర్తయ్యేసమయానికి అభ్యర్ధులంతా రంగంలోకి దిగేట్లు, ఎన్నికలను ఎదుర్కొనేట్లుగా అనుకున్నారు.





అక్టోబర్ లో మొదలయ్యే యాత్ర మార్చిలో ముగియగానే అదే హీట్ లో ఎన్నికలను ఎదుర్కోవటమే తరువాయన్నట్లుగా పవన్ అనుకున్నారు. అయితే తాజా పరిణామాల చూస్తుంటే ఎన్నికలు షెడ్యూల్ ప్రకారం 2024లో జరుగబోతున్నట్లు అర్ధమైందట. అంటే యాత్ర ముగిసిన ఏడాది తర్వాత కానీ ఎన్నికలు జరగదు. మరి యాత్ర ద్వారా వచ్చే హైప్ ను ఏడాదిపాటు పట్టిపెట్టాలంటే ఎవరికీ సాధ్యంకాదు. జనాలంతా యాత్రను మరచిపోవటం ఖాయం. సో ఇపుడు యాత్రచేసినా మిగిలేది ఆయాసం తప్పు మరేమీ కాదని అర్ధమైపోయే యాత్రను వాయిదా వేసుకున్నట్లు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి: