కేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో పథకాలను అమలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే అమలు అవుతున్న సంక్షేమ పథకాలు అందరికి లాభాలను అందిస్తున్నాయి.. ఎన్నో పథకాలను అందిస్తూ ప్రజలకు ఆసరాగా నిలుస్తుంది.. వాటి ద్వారా ఎంతో మంది లబ్ది పొందుతున్నారు.. ఇకపోతే రేషన్ కార్డుదారుల కు కేంద్ర ప్రభుత్వం మరో గుడ్ న్యూస్ ను చెప్పింది. రేషన్‌ కార్డు ఉన్నవారికి కూడా కరోనా నుంచి ఉచిత రేషన్‌ అందిస్తోంది.


ఇప్పటికీ కూడా రేషన్ ను ప్రజలు అందుకుంటున్నారు. ఇకపోతే ఇప్పుడు మరో వార్తను రేషన్ కార్డు దారుల కు చెప్పింది. తాజాగా రేషన్‌ కార్డు ఉన్నవారికి కేంద్రం మరో నిర్ణయం తీసుకుంది. ఇక నుంచి అంత్యోదయ రేషన్ కార్డు దారులకు ఉచిత రేషన్‌ తో పాటు ఉచిత వైద్య సదుపాయం కూడా అందిస్తోంది. ఈ విషయం పై ప్రభుత్వం ప్రచారం కూడా నిర్వహిస్తోంది. అంత్యోదయ కార్డు హోల్డర్లందరి కీ ఉచిత చికిత్స కోసం ఆయుష్మాన్ కార్డులను అందించాలని నిర్ణయించింది..


ఈ సదుపాయాన్ని ప్రభుత్వం అనేక కేంద్రాల లో కల్పిస్తోంది. ఇందులో రేషన్ కార్డు చూపి జన్ సువిధ కేంద్రంలో ఆయుష్మాన్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. తమ రాష్ట్ర అంత్యోదయ కార్డు హోల్డర్ల ఆయుష్మాన్ కార్డుల ను తయారు చేయాల ని ఆదేశించినట్లు యూపీ ప్రభుత్వం తెలిపింది. అయితే ప్రభుత్వం కూడా రేషన్‌ కార్డుదారుల జాబితాను చూసి ఆయుష్మాన్‌ భారత్‌ కార్డులను తయారు చేస్తోంది. ప్రభుత్వం సెప్టెంబర్‌లో కూడా ఉచిత రేషన్ ఇస్తోంది. ఈ ఆయుష్మాన్‌ కార్డులను దేశ వ్యాప్తంగా అందించేందుకు ప్రభుత్వం చర్యలు చేపడుతోంది.. వీటి ద్వారా ప్రజలకు చాలా లాభాలు ఉంటాయని అధికారులు చెబుతున్నారు.. ఇప్పటికే ఎంతో మంది ఆయుష్మాన్ కార్డుల ను కలిగి ఉన్నారు.. ఈ కార్డులకు అప్లై చేసుకోవాలనుకునే వారు ప్రభుత్వ కేంద్రాల్లో చేసుకోవచ్చు..


మరింత సమాచారం తెలుసుకోండి: