ఇపుడిదే విచిత్రంగా ఉంది. ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు కొడుకు నారా లోకేష్ పాదయాత్ర చేయాలని అనుకున్నారు. 450 రోజులపాటు జనాల్లోనే ఉండేట్లుగా లోకేష్ తన పాదయాత్రను ప్లాన్ చేసుకుంటున్నారు. 2023 జనవరి 26వ తేదీన మొదలుపెట్టబోయే పాదయాత్ర 2024, మార్చివరకు సాగుతుందట. అంటే 2024 షెడ్యూల్ ఎన్నికల ముందటివరకు పాదయాత్రతో జనాల్లో ఉండాలని లోకేష్ డిసైడ్ అయినట్లు తెలుస్తోంది.





మామూలుగా పాదయాత్రంటే అధికారపార్టీకి లేదా ఇతర ప్రతిపక్షపార్టీలకు ఆందోళన కలిగించాలి. ఎందుకంటే పార్టీకి జనాలను దగ్గర చేయాలని, రాబోయే ఎన్నికల్లో గెలవాలన్న టార్గెట్ తోనే ఎవరైనా పాదయాత్ర చేస్తారు. ఒకపుడు చంద్రబాబు చేసిన పాక్షిక పాదయాత్ర అయినా తర్వాత జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్ర లక్ష్యమైనా అధికారం అందుకోవటమే. ఇపుడు జాతీయస్ధాయిలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధి చేస్తున్న పాదయాత్ర ఉద్దేశ్యం కూడా ఇదే.





వచ్చే ఎన్నికల్లో అధికారం అందుకోవటమే టార్గెట్ గా లోకేష్ పాదయాత్ర చేయాలని అనుకుంటున్నారు. నిజంగా లోకేష్ నిర్ణయంతో వైసీపీ నేతల్లో ఆందోళన కనబడాలి. కానీ ఉల్టాగా అధికారపార్టీ నేతలంతా ఫుల్లు హ్యాపీగా ఉన్నారు. లోకేష్ ఎంత ఎక్కువగా జనాల్లో ఉంటే తమకు అంత అడ్వాంటేజ్ వస్తుందంటున్నారు. ఎందుకంటే లోకేష్ పైన అంత నమ్మకంగా ఉన్నారు. విషయం ఏమిటంటే మామూలుగానే లోకేష్ ఏమి మాట్లాడుతారో తనకే తెలీదు. నోటికొచ్చినట్లు మాట్లాడేసి ఇప్పటికే ఎన్నోసార్లు అబాసుపాలయ్యారు. అయినా తన పద్దతిని మార్చుకోవటానికి ప్రయత్నాలు చేయటంలేదు.






ఎప్పుడో ఒకసారి మాట్లాడితేనే లోకేష్ అన్ని తప్పులు మాట్లాడితే ఇక పాదయాత్రలో 24 గంటలూ జనాల్లోనే ఉండాల్సుంటుంది. దాంతో మీడియా కూడా వెన్నంటే ఉంటుంది. మరపుడు లోకేష్ మాటలు ఇంకెంత గందరగోళంగా ఉంటుందో చెప్పాల్సిన అవసరంలేదు. సరిగ్గా ఈ విషయంలోనే వైసీపీ నేతలు ఖుషీగా ఉన్నారు. లోకేష్ మాటలవల్ల టీడీపీకే నష్టం జరుగుతుందని అదే తమకు ప్లస్సుగా మారుతుందని వైసీపీ నేతలు అనుకుంటున్నారు. అందుకనే లోకేష్ పాదయాత్ర చేయబోతున్నారనగానే హ్యాపీగా ఫీలవుతున్నది.

మరింత సమాచారం తెలుసుకోండి: