వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 67 సీట్లకు మించి రావని జనసేన అధినేత పవన్ కల్యాణ్ జోస్యం చెప్పారు. బహుశా ఇప్పటికిప్పుడు ఎన్నికలు వస్తే అనిగానీ లేదా వచ్చే ఎన్నికల్లో ఏపార్టీకి ఎన్నిసీట్లు వస్తాయనే విషయంలో సర్వేలు చేయించినట్లున్నారు. అందుకనే వైసీపీకి మ్యాగ్జిమమ్ 67 సీట్లు వస్తాయని చెప్పారు.  ఈమధ్యనే మాట్లాడుతు వైసీపీకి 15 సీట్లకు మించి రాదని చెప్పినట్లుగుర్తు.  దీంతో పవన్ మాటల్లోనే వైసీపీ పరిస్ధితి ఏమిటో అర్ధమైంది. మరి టీడీపీ, జనసేనకు రాబోయే సీట్లెన్ని ? వైసీపీ గురించి చెప్పిన నిపుణులు ఈ రెండు పార్టీల గురించి చెప్పలేదా ?





ఇక్కడే పార్టీ పరిస్ధితి గురించి ప్రత్యేకంగా పవన్ చెప్పకపోయినా ఆయన మాటల్లో పార్టీ పరిస్ధితి ఏమిటో అర్ధమైపోతోంది. రాష్ట్రంలో ఉన్నవే 175 సీట్లు. ఇందులో వైసీపీకి 67 సీట్లు వస్తాయని అనుకుందాం. మరి మిగిలేవి 108 సీట్లు మాత్రమే. టీడీపీ, జనసేన పొత్తులో పోటీచేస్తాయా ? లేకపోతే దేనికదే పోటీచేస్తాయా అన్న విషయం తేలలేదు. ఒకవేళ పొత్తులో పోటీచేస్తుందనే అనుకుందాం. అప్పుడు టీడీపీ పోటీచేసే సీట్లెన్ని, జనసేన ఎన్నిసీట్లో పోటీచేస్తుందనేది కీలకం.






ఎంతైనా మేజర్ పార్టనర్ కాబట్టి టీడీపీయే మెజారిటి సీట్లలో పోటీచేస్తుంది. టీడీపీ 100 సీట్లలో పోటీచేసినా జనసేనకు మిగిలేది 75 సీట్లు మాత్రమే. ఏదో 20 లేకపోతే 30 సీట్లో ఇచ్చి చేతులు దులుపుకుందామని చంద్రబాబునాయుడు అనుకుంటే సాధ్యంకాదు. ఎందుకంటే అధికారంలోకి రాబోయేది తామే అని టీడీపీ లాగే పవన్ కూడా అనుకుంటున్నారు. కాబట్టి కచ్చితంగా ఎన్నిసీట్లు వీలుంటే అన్నీ రాబట్టుకుంటారు. ఇందుకనే 100-75 సీట్లలో పోటీచేస్తాయని అంచనా వేసింది.






పోటీచేస్తారు సరే ఏ పార్టీ ఎన్నిసీట్లలో గెలుస్తుంది ? అన్నది ఇపుడే చెప్పేందుకు లేదు. ఎవరెన్నింటిలో గెలిచినా జనసేన  గెలిచే సీట్లయితే తక్కువనే చెప్పాలి. రెండుపార్టీల మధ్య ఓట్ల బదిలీ సక్రమంగా జరిగితే ఓకే. లేకపోతే మాత్రం జనసేన పోటీచేసే సీట్లలో అత్యధికం వైసీపీనే గెలిచే అవకాశముంది. అదే జరిగితే వైసీపీకి 67 సీట్లనే పవన్ లెక్క పూర్తిగా తప్పయిపోతుంది.  ఎలా చూసుకున్నా జనసేన గెలిచే సీట్లు చాలా తక్కువని అర్ధమైపోతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: