ఆంధ్రప్రదేశ్ లో రాబోయే ఎన్నికల ఎన్నో జీవితాలను మార్చేస్తాయి అని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా ఈ ఎన్నికలపై టీడీపీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఈ విషయం పైన చాలా చర్చలే జరుగుతున్నాయి, అందుకు ప్రధాన కారణం గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఉన్న సమయంలో టీడీపీ కి ఎలా అయితే అడ్డుగా కాంగ్రెస్ పార్టీ ఉందో... ఇప్పుడు వైసీపీ అధ్యక్షుడు మరియు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అడ్డుగా ఉన్నాడు. ఎంతలా అంటే... అస్సలు టీడీపీ ని ఏ విషయంలోనూ పుంజుకునే అవకాశం ఇవ్వడం లేదు. గత ఎన్నికల్లో టీడీపీ ని ఓడించిన దగ్గర నుండి తర్వాత రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికలలో మరియు ఉప ఎన్నికలలోనూ అణగదొక్కింది.

రాష్ట్రంలో సీనియర్ రాజకీయ నాయకులూ మరియు ఎన్నికల విశ్లేషకులు టీడీపీ పని అయిపోయిందని డిసైడ్ అయిపోయారు. కానీ చంద్రబాబు మాత్రం కొంతకాలం సైలెంట్ గా ఉన్నా నెమ్మదిగా మళ్ళీ పార్టీకి పునర్వైభవం తీసుకురావడానికి తీవ్రంగా కృషి చేస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా మీటింగ్ లను కండక్ట్ చేస్తూ తెలుగు తమ్ముళ్లలో చలనము తీసుకువస్తున్నారు. అయినప్పటికీ టీడీపీ క్యాడర్ లో తగినంత బలం లేదనే చెప్పాలి. నియోజకవర్గాలలో ప్రజలకు టీడీపీ పై నమ్మకం లేదు. ఎన్నికల్లో గెలవడానికి చేయాల్సిన మొదటి పని... ఓట్లు వేసే ప్రజల విశ్వాసాన్ని పొందడమే. అందుకు అవసరం అయిన వ్యూహాలతో ప్రజల ముందుకు వెళ్ళాలి.

అంతే కానీ అధికార వైసీపీకి వ్యతిరేకంగా ప్రచారం చేస్తూ వచ్చే మార్పు తాత్కాలికం అని చెప్పాలి. పైగా ఇది ఎన్నికలో గెలిచేందుకు ఉపయోగపడుతుందా అంటే చెప్పలేము. తమ బలం ఏమిటో ? తమను ఎన్నికల్లో గెలిపిస్తే ఏమి చేయగలమో అన్న విషయాన్ని స్పష్టంగా ప్రజలకు తెలియచేయాలి. మరి ఈ విషయంపైన చంద్రబాబు దృష్టి పెట్టి ఇక ఉన్న కాస్త సమయాన్నిసరిగా ఉపయోగించుకుంటాడా అన్నది చూద్దాం.  

మరింత సమాచారం తెలుసుకోండి: