మాములుగా ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఫలితాల గురించి అందరూ తమకు తోచిన ఫలితాలను ఊహిస్తూ ఉంటారు. అయితే ఊహలు వేరు వాస్తవాలు వేరు అన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. కానీ కొన్ని సర్వేల ఫలితాలు మాత్రం నెంబర్ అటూ ఇటూ ఉన్నప్పటికీ గెలుపు ఓటమి మాత్రం మ్యాచ్ అవుతూ ఉంటుంది. అయితే ప్రస్తుతం ఏపీలో వచ్చే ఎన్నికల గురించి ఓటు వేసే సాధారణ ఓటరు దగ్గర నుండి ఆ గెలుపు ద్వారా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే సీఎం వరకూ అందరూ నెక్స్ట్ ఎన్నికల ఫలితం గురించి ఒక అంచనాతో ఉన్నారు. వైసీపీ అధ్యక్షుడు మరియు ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి అయితే ఈ సారి ఎన్నికలలో వైసీపీ క్లీన్ స్వీన్ చెయ్యాలని చేస్తుందని బలంగా నమ్ముతున్నారు.

ఇక ప్రతిపక్ష పార్టీ టీడీపీ అయితే కసితో రగిలిపోతోంది. ఏపీలో నెక్స్ట్ జరిగే ఎన్నికలలో ఎలాగైనా వైసీపీ ని ఓడించి అధికారంలోకి రావాలని వ్యూహాలు రచించుకుంటోంది. ఇక ఈసారి ఏపీ ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారు అని చెప్పుకుంటున్న జనసేన ఇంకా పొత్తుల విషయంలోనే సరైన నిర్ణయం తీసుకోలేదు. కాగా నెక్స్ట్ ఎన్నికల్లో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కూడా వైసీపీ గురించి జోస్యం చెప్పడం వైరల్ గా మారింది. అయితే పవన్ చెప్పిన ప్రకారం వైసీపీ కి 67 సీట్లకు మించి రావట. దీనికి చెప్పిన కారణాలు ఇలా ఉన్నాయి. గత ఎన్నికల్లో వైసీపీ ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో విఫలం అయింది.

అందుకే వచ్చే ఎన్నికల్లో ప్రజలు వైసీపీన్ తిరస్కరిస్తారు అంటూ పవన్ వివరణ ఇచ్చాడు. ఈ జోస్యంపై ఇప్పటికే వైసీపీ నాయకులు కౌంటర్ అటాక్ ఇచ్చారు. మరి పవన్ చెప్పిన వైసీపీ ఎన్నికల జోస్యం నిజం అవుతుందా లేదా అన్నది తెలియాలంటే ఎన్నికల వరకు ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: