తన హయాంలో జరిగిన డేటాచౌర్యం కేసులో చంద్రబాబునాయుడు గట్టిగా తగులుకోబోతున్నారా ? జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే అవుననే అనిపిస్తోంది. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నకాలంలో అంటే 2017-19 మధ్య కాలంలో పెద్దఎత్తున ఏపీలోని పౌరుల వ్యక్తిగత డేటా చౌర్యం జరిగింది. ఈ డేటాచౌర్యం మొత్తం తెలుగుదేశానికి చెందిన సేవామిత్ర యాప్ ద్వారానే జరిగిందని నిర్ధారణైంది. డేటాచౌర్యం, ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలపై విచారణ చేసేందుకు స్పీకర్ తిరుపతి ఎంఎల్ఏ  భూమన కరుణాకర్ రెడ్డి నాయకత్వంలో సభా కమిటిని వేశారు.






సదరు కమిటి మంగళవారం అసెంబ్లీకి మధ్యంతర నివేదికను అందించింది. నివేదికలోని అంశాల ప్రకారం చంద్రబాబు గట్టిగా తగులుకునేట్లే ఉన్నారు. ఇంతకీ నివేదికలోని విషయాలు ఏమిటంటే 18 స్టేట్ డేటా సెంటర్లనుండి పెద్దఎత్తున పౌరుల వ్యక్తిగత డేటా చౌర్యం జరిగినట్లు ఆధారాలు లభించాయి. చౌర్యం జరిగిన విధానాన్ని, చౌర్యం చేసిన వాళ్ళ వివరాల కోసం కమిటి గుగూల్ యాజమాన్యంతో మాట్లాడుతోంది. సభాసంఘం కొన్ని ఐపీ అడ్రసులను కూడా గుగూల్ కు అందించింది.





అయితే ఈ ఐపీ అడ్రస్ లను గుర్తించటం కష్టమని గుగూల్ చెప్పేసింది. సభా కమిటి అందించిన ఐపి అడ్రస్సులు గుగూల్ వే అని మాత్రం నిర్ధారించింది. సదరు ఐపీ అడ్రసులను తాము ఎవరికీ కేటాయించలేదని అయినా కొన్ని ఐపీ అడ్రసులు చోరీకి గురైనట్లు తాము గుర్తించామని సమాధానం చెప్పింది. దాంతో హ్యాకింగ్ నిపుణుల సాయంతోనే ఇటు ప్రభుత్వాన్ని అటు గుగూల్ ను కూడా ఎవరో మోసం చేసినట్లు బయటపడిం. ఎప్పుడు అవసరమైనా ప్రభుత్వానికి తమ న్యాయవిభాగం అందుబాటులో ఉంటుందని కూడా గుగూల్ చెప్పింది.





ఏపీ కంప్యూటర్ సెక్యూరిటి  ఆపరేషన్స్ సెంటర్ పర్యవేక్షణలో రాష్ట్రంలోని కంప్యూటర్ నెట్ వర్క్, డేటా భద్రత, సర్వర్ల వివరాలను ఇంటెలిజెన్స్ విభాగం విశ్లేషిస్తోంది. డేటా చౌర్యానికి సంబంధించిన లావాదేవీలన్నీ లాగ్స్ రూపంలో జరిగినట్లు గుర్తించింది.  ఎలాగైనా ఐపీ అడ్రసులను గుర్తించి అందుకు బాధ్యులపై యాక్షన్ తీసుకోవాలని ప్రభుత్వం చాలా పట్టుదలగా ఉంది. అంటే డేటా చౌర్యం జరిగిందని ఎవరైనా గుర్తించినా ఎలా జరిగింది ? ఎక్కడినుండి జరిగింది ? ఎవరు చౌర్యం చేశారనే విషయాలు దొరక్కుండా నిపుణులు ఎవరో చాలా జాగ్రత్తలు తీసుకున్నట్లు అర్ధమవుతోంది. మరీ కేసు ముందు ముందు ఎన్ని మలుపులు తీసుకుంటుందో చూడాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి: