జనసేన అధినేత పవన్ కల్యాణ్ వైఖరి చూస్తుంటే ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని టార్గెట్ చేయటంతోనే పవన్ రాజకీయ జీవితమంతా సరిపోతోందనే సెటైర్లు జనాల్లో వినబడుతోంది. వైసీపీ విషయంలో పెట్టేంత శ్రద్ధ సొంతపార్టీపైన ఎందుకు పెట్టడం లేదో పార్టీ నేతలకే అర్ధం కావటంలేదు. తాజాగా వచ్చే ఎన్నికల్లో వైసీపీకి రాబోయే సీట్లను పవన్ చెప్పటంతోనే మళ్ళీ పార్టీలో అదే చర్చ మొదలైంది. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి 45-67 సీట్లకన్నా రాదన్నారు.





బాగానే ఉంది వైసీపీకి మ్యాగ్జిమమ్ వచ్చేసీట్లు 67గా పవన్ మాటల్లో తేలిపోయింది. 67 సీట్లు రావటమంటే మామూలు విషయంకాదు. 2014-19 మధ్య సరిగ్గా 67 సీట్లతోనే వైసీపీ చంద్రబాబునాయుడు అండ్ కో ను అసెంబ్లీలోపలా బయటా ఒక ఆటాడుకున్నది. వైసీపీకి 67 సీట్లు వస్తాయి సరే మరి మిగిలిన పార్టీల సంగతేంటి ? ఇందులో జనసేనకు ఎన్నిసీట్లు వస్తాయి ? ఇక్కడే పార్టీలోని నేతల్లో అయోమయం పెరిగిపోతోంది. జనసేన ఒంటరిగా పోటీచేస్తే పట్టుమని 20 సీట్లుకూడా రావన్న విషయం బయటపడిందా ? అనే చర్చ పెరిగిపోతోంది.





జాతీయమీడియా చేసిన అనేక సర్వేల్లో అసలు జనసేనను పరిగణలోకే తీసుకోలేదు. నిజానికి ఇప్పటికిప్పుడు ఎన్నికలంటు జరిగితే జనసేన చేతులెత్తేయాల్సిందే తప్ప వేరేదారిలేదు. ఎందుకంటే 175 నియోజకవర్గాల్లో పోటీచేయటానికి  పార్టీకి గట్టి అభ్యర్ధు లేరని అందరికీ తెలుసు.





మరీ పరిస్ధితుల్లో వైసీపీకి 67 సీట్లు వస్తాయని చెప్పిన పవన్ జనసేనకు ఎన్నిసీట్లు వస్తాయనే విషయాన్ని ఎందుకు చెప్పలేదు ? ఎందుకంటే వచ్చే సీట్లేమీ లేవా ? అనే చర్చ పార్టీలోనే మొదలైంది. ఇప్పటివరకు వైసీపీకి అన్ని సీట్లొస్తాయి ఇన్ని సీట్లొస్తాయని పవన్ చాలాసార్లే చెప్పారు. ఎప్పుడు కూడా జనసేనకు ఇన్ని సీట్లొస్తాయని ఒక్కసారి కూడా చెప్పలేదు. దీంతోనే జనసేన ఎంత బలహీనంగా ఉందో పార్టీ నేతలకు అర్ధమైపోతోంది. వైసీపీ గెలుచుకునే సీట్లను చెప్పి సొంతపార్టీకి వచ్చే సీట్లు చెప్పకపోవటంతోనే పార్టీకి జనాల్లో పెద్ద బలంలేదనే విషయం పవన్ మాటల్లోనే బయటపడుతోందని జనాలు చెప్పుకుంటున్నారు.




మరింత సమాచారం తెలుసుకోండి: