ఆరోగ్య విశ్వవిద్యాలయానికి ఎన్టీయార్ పేరును తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టాలని అసెంబ్లీ తీర్మానం చేసింది. అసెంబ్లీ తీర్మానం అయిపోయింది కాబట్టి ఇకనుండి హెల్త్ యూనివర్సిటి డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటి అయిపోయింది. సరే పేరు పెట్టడం, తీసేయటం అంతా రాజకీయ ఎజెండాతోనే జరుగుతాయన్న విషయం అందరికీ తెలిసిందే. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరు తీసేయాలా ? ఉంచాలా ? అసలు డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టాల్సిన అవసరం ఏమిటనేది పెద్ద చర్చ. ఆ చర్చలోకి మనం వెళ్ళటంలేదు.





ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ఉన్నపుడే ఎన్టీయార్ హెల్త్ స్కీమ్ పేరును మార్చేయాలని డిసైడ్ అయ్యారు. ఎక్కడా ఎన్టీయార్ పేరు వినబడకుండా చేయాలని చంద్రబాబు గట్టిగా అనుకున్నారు. తాను సీఎం అవగానే ఎన్టీయార్ బొమ్మున్న  పార్టీ సభ్యత్వ నమోదు పుస్తకాలను మూలనపడేసి తన బొమ్మతో కొత్త పుస్తకాలను అచ్చేయించుకున్నారు. ఎన్టీయార్ అభిమానులనుండి నిరసనలు రావటం టీడీపీ బతికున్నంతకాలం ఎన్టీయార్ పేరును వేరుచేయలేమన్న విషయం తెలిసింది. దాంతో వెంటనే ప్లేటు మార్చేసి ఎన్టీయార్ జపం చేయటం మొదలుపెట్టారు.





అయితే ఇక్కడ పాయింట్ ఏమిటంటే హెల్త్ యూనివర్సిటికీ ఎన్టీయార్ పేరు మార్చేయగానే అధికార భాషా సంఘం ఛైర్మన్ యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తన పదవికి రాజీనామా చేశారు. ఎన్టీయార్ పేరు మార్పుకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్లు చెప్పారు. అసలు యార్లగడ్డకు వైసీపీకి ఎలాంటి సంబంధంలేదు. టీడీపీ నుండి వ్యతిరేకత వస్తుందని ఊహించినా తన అనుకున్న వాళ్ళే అభ్యంతరం చెబుతారని జగన్ ఊహించుండరు.






అయినా సరే ఏవో కారణాలతో యార్లగడ్డను పిలిచి జగన్ నెత్తిన పెట్టుకున్నారు. దానికి ఇపుడు యార్లగడ్డ సరిగ్గానే సమాధానం చెప్పారు. అలాగే గన్నవరం ఎంఎల్ఏ వల్లభనేని వంశీ కూడా అభ్యంతరం చెప్పారు. హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరునే కంటిన్యు చేయాలన్నారు. మరిద్దరు ప్రముఖులు జగన్ నిర్ణయంపై అభ్యంతరం చెబితే మరి ఎన్టీయార్ భార్య, తెలుగు ఎకాడమీ ఛైర్ పర్సన్ అయిన లక్ష్మీపార్వతి మాత్రం ఏమీ మాట్లాడలేదు. ఎన్టీయార్ తో సంబంధం లేని వాళ్ళే ప్రభుత్వ నిర్ణయంపై అభ్యంతరం చెబితే మరి ఎన్టీయార్ భార్య లక్ష్మీపార్వతి నోరిప్పకపోవటమే విచిత్రంగా ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి: