ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలలో జనసేన కూడా ఒకటి. ఈ పార్టీని ప్రముఖ టాలీవుడ్ హీరో మరియు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్థాపించడం జరిగింది. పవన్ పార్టీ పెట్టిన తర్వాత ఒక్క సారి మాత్రమే ఎన్నికలలో పోటీ చేసింది. 2019 ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ టీడీపీ తో పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళ్లడం జరిగింది. అయితే అప్పటికే టీడీపీ అధికారంలో ఉండడంతో మళ్ళీ టీడీపీ అధికారం లోకి వస్తుందని అంతా ఊహించారు.. కానీ ఏమి జరిగిందో అందరికీ తెలుసు. ఆ ఎన్నికలో జనసేన పార్టీ తరపున గెలిచింది కేవలం ఒక్క ఎమ్మెల్యే మాత్రమే . ఇక జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం రెండు స్థానాలు (భీమవరం మరియు గాజువాక) లలో పోటీ చేసినప్పటికీ గెలుపును అందుకోలేక పోయారు.

కానీ ఎన్నికలకు ముందు తాను ప్రచారం చేసిన ప్రతి సభ మరియు మీటింగ్ లకు జనాలు కోకొల్లలుగా వచ్చారు. అయితే ఈ జనాన్ని చూసిన పవన్ కళ్యాణ్ గెలుస్తాను అని అనుకున్నా..  ఫలితాలు వెలువడ్డాక ఖంగు తినక తప్పలేదు. అప్పటి నుండి అభిమానులను ఓటర్లుగా మార్చుకోవడానికి గత మూడున్నరేళ్లుగా శ్రమిస్తూనే ఉన్నాడు. అయితే ఇంకా తనకు ఫ్యాన్స్ పై పూర్తి నమ్మకం వచ్చినట్లు లేదు. పవన్ స్వయంగా చాలా మీటింగ్ లలో అన్నాడు మీరు మీటింగ్ లకు వస్తారు... పవన్ పవన్ అంటూ జేజేలు పలుకుతారు. కానీ ఓట్లు మాత్రం వేయడం లేదు అని బాధపడ్డారు .

అయితే ఈ సారి భారీ ప్రణాళికతో ఎన్నికలకు వెళ్తున్న పవన్ ఫ్యాన్స్ అభిమానాన్ని ఓట్లుగా మలుచుకుంటారా ? పవన్ ఆవేదనను ఫ్యాన్ అర్ధం చేసుకుని ఓట్లు వేస్తారా ? పవన్ ను సీఎం వరకు కాకపోయినా కనీసం ఎమ్మెల్యేను అయినా చేస్తారా అన్నది తెలియాలంటే మరో ఒకటిన్నర సంవత్సరం ఆగాల్సిందే.  

మరింత సమాచారం తెలుసుకోండి: