ప్రస్తుతం తెలంగాణాలో మునుగోడు ఉప ఎన్నిక కాకమీదుంది. ఈ ఎన్నికలో గెలవడానికి అన్ని పార్టీలు సర్వ శక్తులను ధారబోస్తున్నాయి. అయితే ఈ ఎన్నికలో గెలవడం కాంగ్రెస్ పార్టీకి చాలా అవసరం.. తెలుగు రాష్ట్రాలలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో అన్నింటా చేదు అనుభవాలు ఎదురయ్యాయి. దీనితో కాంగ్రెస్ అధిష్టానం మళ్ళీ ఎలాగైనా ప్రజల్లో విశ్వాసాన్ని తెచ్చుకోవడానికి ప్రయత్నాలు చేస్తోంది. అందుకే తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిని సైతం మార్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం టీపీసీసీ అధ్యక్షుడుగా ఫైర్ బ్రాండ్ రేవంత్ రెడ్డి ఉన్నాడు. కాగా ఈయన ఈ మునుగోడు ఉప ఎన్నికను చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాడు.

అయితే వీరికి అనుకూలంగా ఉన్న ఒకే ఒక్క విషయం మునుగోడు సిట్టింగ్ ఎమ్మెల్యే స్థానం కావడం ఒక్కటే అని చెప్పాలి. అయితే రేవంత్ వాచకనే పార్టీలో పొత్తు కుదరక రాజగోపాల్ రెడ్డి బీజేపీలోకి వెళ్ళారన్నది వాస్తవం. అయితే ఇపుడు అన్నింటినీ పక్కన పెట్టేసి పార్టీని ఎలాగైనా గెలిపించాలన్న కృషితో సీనియర్ నాయకులు కూడా కష్టపడుతున్నారు. అయితే తాజాగా సీఎల్పీ నేత బట్టి విక్రమార్క ఈ ఎన్నికకు సంబంధించిన సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే. బట్టి చెప్పిన దాని ప్రకారం ఒక్కో పోలింగ్ బూత్ నుండి కాంగ్రెస్ కు కనీసం  250 ఓట్లను సాధించాలి అని చెప్పారు. ఇక్కడ మొత్తం 45 బూత్ లు ఉన్నాయి. దాని ప్రకారం 11500 ఓట్లు అక్కడే వస్తాయి..

ఈ బూత్ కమిటీలు మరియు వారి విధులను క్షుణ్ణంగా వివరించి చెప్పారు బట్టి విక్రమార్క. ఇక నేతలు అంతా కూడా మిగిలిన పార్టీల లాగా సభలు పైన దృష్టి పెట్టకుండా.. ప్రతి ఒక ఓటరును డైరెక్ట్ గా వారింటికి వెళ్లి కలిసి మాట్లాడితే ప్రయోజనం ఉంటుందని వివరించారు. ఈ నియోజకవర్గంలో కాంగ్రెస్ కు ఉన్న పట్టు ను బట్టి చూస్తే... ఈ ఎన్నికలో గెలవడం అంత కష్టం కాదని నేతలకు ధైర్యాన్ని మరియు ఆత్మస్తైర్యాన్ని ఇచ్చారు బట్టి. మరి ఒక టీం గా కాంగ్రెస్ ఈ ఉప ఎన్నికలో బీజేపీ మరియు తెరాస లను దాటుకుని గెలుస్తుందా చూడాలి.



 
దే. మరి ఉపఎన్నికలో ఏమవుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: