రైతులకు అదిరిపోయే గుడ్ న్యూస్ లను కేంద్ర ప్రభుత్వం చెబుతూ వస్తుంది. పీఎం కిసాన్ పథకాన్ని అందుబాటులోకి తీసుకొని వచ్చారు.ఈ పథకం ద్వారా రైతులకు రూ.6 వేలు అందించనున్నారు. కిసాన్ క్రెడిట్ కార్డ్ ప్రయోజనాలు అందరికి తెలుసు. రైతులు ఈ కార్డు సహాయం తో తక్కువ వడ్డీకి రుణం పొందుతారు.. అనేక ఇతర ప్రయోజనాలను కలిగి ఉంటుంది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఫెడరల్ బ్యాంక్‌ లో ఖాతా ఉన్న రైతులు మరింత సంతోషిస్తారు. ఈ రెండు బ్యాంకులు పైలట్ ప్రాజెక్ట్‌ను ప్రారంభించాయి. దీని కింద బ్యాంకులు రైతుల కు డిజిటల్ పద్ధతి లో కిసాన్‌ క్రెడట్ కార్డు ఇవ్వడం ప్రారంభించాయి.


వ్యవసాయ భూమికి సంబంధించిన కాగితాల వెరిఫికేషన్ కోసం బ్యాంకుకి వెళ్లనవసరం లేదు.. పైలట్ ప్రాజెక్టుల కింద గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకుల డిజిటలైజేషన్‌ పై దృష్టి సారించారు. ఈ ప్రాజెక్టును రిజర్వ్ బ్యాంక్ ప్రారంభించింది. యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మధ్య ప్రదేశ్‌ లోని హర్దా జిల్లా లో పైలట్ ప్రాజెక్ట్‌ ను ప్రారంభించింది. దీంతో పాటు చెన్నై లో ఫెడరల్ బ్యాంక్ ఈ ప్రాజెక్టు ను ప్రారంభించింది. త్వరలో ఈ సేవలు దేశవ్యాప్తం గా అమలులోకి వస్తాయని యూనియన్ బ్యాంక్ అధికారులు చెబుతున్నారు..


మారుతున్న సాంకేతిక పరిజ్ఞానాని కి అనుగుణం గా రైతులు ముందుకు సాగాలని ప్రభుత్వం గతంలోనే ప్రస్తావించింది. పైలట్ ప్రాజెక్టుల కింద ఆన్‌లైన్ ప్రక్రియ ప్రారంభించడం తో కిసాన్ క్రెడిట్ కార్డ్ (కెసిసి) కోసం ఇంట్లో కూర్చొని మొబైల్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ ప్రక్రియ వల్ల రైతులకు సమయం ఆదా అవడంతో పాటు బ్యాంకు ల్లో రద్దీ తగ్గుతుంది. రైతులు భూ పత్రాల పరిశీలన కోసం బ్యాంకు ను సందర్శించాల్సిన అవసరం లేదు. వ్యవసాయ భూమి పత్రాలను స్వయంగా బ్యాంక్ అధికారులు వెరిపై చేస్తుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: