ఆంధ్రప్రదేశ్ లో మరో అంశం రాజకీయంగా కాక పుట్టిస్తోంది. అసెంబ్లీ సమావేశాలలో సీఎం జగన్ ప్రవేశ పెట్టిన బిల్లు ఇందుకు కారణం. విజయవాడలో ఉన్న ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ గురించి అందరికీ తెలిసిందే. చాలా కాలంగా ఇది అదే పేరుతో సేవలను అందిస్తోంది. కాగా నిన్న తీసుకు వచ్చిన బిల్లు కారణంగా ఇప్పుడు దాని పేరు వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మారిపోయింది. ఇక అది మొదలు ఏపీలోని టీడీపీ నాయకులు అందరూ జగన్ పై మాములుగా వ్యాఖ్యలు చేయడం లేదు. ఇక చంద్రబాబు అయితే ఏకంగా నేను అధికారంలో ఉన్నప్పుడు ఇలా ఆలోచిస్తే మీకు సంబంధించినవి ఏమైనా మిగిలి ఉండేవా అంటూ ఒక రేంజ్ లో రెచ్చిపోయారు .

కాగా ఈ విషయంపై అటు రాజకీయంగా మరియు నైతికంగా తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. అయితే ఈ విషయంపైన జూనియర్ ఎన్టీఆర్ రెస్పాండ్ అవ్వాలని అతని ఫ్యాన్స్ మరియు సీనియర్ ఎన్టీఆర్ అభిమానులు కోరుకున్నారు. అనుకున్న విధంగానే కాసేపటి క్రితమే ఎన్టీఆర్ ట్విట్టర్ వేదికగా తనదైన శైలిలో ఈ అంశంపై స్పందించారు. ఎన్టీఆర్ ట్విట్టర్ లో మాట్లాడుతూ... స్వర్గీయలు ఎన్టీఆర్ మరియు వైఎస్సార్ లు ఇద్దరూ కూడా ప్రజల మనస్సులో చెరగని ముద్రను వేసుకున్నవారే. తాము రాజకీయాల్లో ఉన్నప్పుడు ప్రజలకు ఎంతో మేలును చేశారు. కేవలం ఇంతకు ముందున్న ఎన్టీఆర్ పేరును తీసేసి... వైఎస్సార్ పేరును పెట్టడం వలన... ఎన్టీఆర్ మరియు వైఎస్సార్ పేరును, కీర్తిని తగ్గించడం లేదా పెంచడం జరగదు అంటూ బాలన్స్ గా మాట్లాడి తనలో రాజకీయాలకు అవసరం అయినా పరిపక్వత ఉందని నిరూపించాడు.

అయితే తాను మాట్లాడిన ఈ రెండు మూడు మాటల వలన చాలా సాఫ్ట్ గా గొప్పవాళ్ళు ఎప్పుడూ గొప్పవాళ్లే అంటూ అందరికీ తెలియచేశాడు. అయితే ఎన్టీఆర్ మాటలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతన్నాయి... బహుశా కొందరు.. వైసీపీ పై ఆగ్రహంతో మాట్లాడలేదని ఫీల్ అయినట్లున్నారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: