అతిచేస్తే గతిచెడుతుందనే సామెత తెలుగుదేశంపార్టీకి సరిగ్గా సరిపోతుంది.  హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీయార్ పేరును తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టడంపై చంద్రబాబునాయుడు+తమ్ముళ్ళు అభ్యంతరం వ్యక్తంచేయటాన్ని ఎవరు తప్పుపట్టరు. కానీ ఆ ముసుగులో చేస్తున్నరాజకీయమే చాలా ఓవరాక్షన్ గా ఉంది. ఎన్టీయార్ పేరును తీసేయటానికి తెలుగువారి ఆత్మగౌరవానికి లింకుపెడుతున్నారు. ఎన్టీయార్ పేరు తీసేయటమంటే తెలుగుజాతికి జరిగిన అవమానంగా నానా రచ్చ చేస్తున్నారు.






ఇక్కడ గమనించాల్సిందేమంటే ఎన్టీయార్ పేరుమార్చటానికి తెలుగుజాతికి, ఆత్మగౌరవానికి ఎలాంటి సంబంధంలేదు. తెలుగుజాతంటే ఎన్టీయార్ ఒక్కళ్ళే కాదు ఆత్మగౌరవం అంటే టీడీపీది మాత్రమే కాదని గ్రహించాలి. ఎన్టీయార్ కు ఏమి జరిగినా యావత్ తెలుగుజాతికి అవమానమంటే ఎవరూ అంగీకరించారు. ఎన్టీయార్ కు ఏమన్నా జరిగితే అది ఆయనకు జరిగినట్లు మాత్రమే. నిజానికి తెలుగుజాతి, ఆత్మగౌరవం అంటు పెద్దపెద్ద మాటలు మాట్లాడుతున్న చంద్రబాబు అండ్ కో వల్లే  ఎన్టీయార్ మానసిక క్షోభతో చనిపోయారు.





ఎన్టీయార్ ను వెన్నుపోటుపొడిచి ముఖ్యమంత్రి పదవిలో నుండి దింపేసిందెవరు ? టీడీపీ పార్టీతో ఎన్టీయార్ కు సంబంధంలేదని చెప్పి లాగేసుకున్నదెవరు ? మానసికంగా క్షోభకు గురై చనిపోవటానికి కారకులెవరు ? ఈ ప్రశ్నలకు సమాధానం చంద్రబాబు, ఎన్టీయార్ సంతానం, టీడీపీ నేతలే అని అందరికీ తెలుసు. ఎన్టీయార్ కు అవమానం జరిగిందంటే అది చంద్రబాబు, ఎన్టీయార్ సంతానం వల్లే. ఇపుడు పేరుమార్పన్నది చాలా చిన్న విషయం. ఎన్టీయార్ పేరుమార్చటాన్ని సమర్ధించటంలేదు.  





అధికారంలో ఎవరుంటే వాళ్ళు తమిష్టం వచ్చిన పేర్లు పెట్టుకోవటం అందరికీ అలవాటే. ఎస్వీ యూనివర్సిటి స్టేడియం పేరును చంద్రబాబు ఎన్టీయార్ స్పోర్ట్స్ పెవిలియన్ అని ఎందుకు మార్చారు ? బాపట్ల ఇంటజనీరింగ్ కాలేజీ, అగ్రికల్చర్ కాలేజీని ఎన్టీయార్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ కాలేజీగా చంద్రబాబు ఎందుకు మార్చారు ? తాను ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి పేర్లు మార్చే అధికారం తనకుందని అనుకున్నారు కాబట్టి మార్చారు. ఇపుడు జగన్మోహన్ రెడ్డి కూడా అదే పద్దతిని అనుసరిస్తున్నారు. చంద్రబాబు చేస్తే ఒప్పు, అదే పని జగన్ చేస్తే తప్పంటే ఎలాగ ?


 




మరింత సమాచారం తెలుసుకోండి: